18 April, 2026 | 2:19 AM

స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణానికి కృషి

18-04-2026 12:00 AM

ఆర్టీసీ ఆర్‌ఎం విజయ భాను

బెజ్జూర్, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణానికి గ్రామపంచాయతీ స్థలం కేటాయిస్తే నిర్మాణం కోసం చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ ఆర్‌ఎం విజయ భాను తెలిపారు. శుక్రవారం ఆయన సిర్పూర్ నియోజకవర్గం లోని కాగజ్నగర్, కౌటాల, పెంచికల్పేట, బెజ్జూర్ మండలాల మారుమూల గ్రామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సర్వీసులపై వివరా లు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. పెంచికల్పేట నుంచి సలుగుపల్లి వరకు రహదారి గుంతలతో దెబ్బతినడంతో బస్సులు తరచుగా చెడిపోతున్నాయని, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.బెజ్జూర్లో బస్టాండ్ నిర్మాణం కోసం గ్రామ సర్పంచ్, పాలకవర్గం స్థలం కేటాయించి తీర్మానం చేసి ఆర్టీసీ ఆసిఫాబాద్ డిపో మేనేజర్ రాజశేఖర్కు సమాచారం అందిస్తే స్థలాన్ని పరిశీలించి నివేదిక పంపిస్తామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.