calender_icon.png 7 May, 2025 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత రైతులను ఆదుకుంటాం

04-05-2025 12:37:10 AM

వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్, మే 3 :  అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహార అందజేసి రైతుల ను ఆదుకుంటామని  ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి హామీని ఇచ్చారు. శనివారం కడ్తాల  మండలంలోని ఏక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల్లో అకాల వర్షాలు వడగండ్ల వాన కు దెబ్బతిన్న వరి పంటల ను వ్యవసాయ అధికారి శ్రీలత తో కలిసి ఏమ్మెల్యే  పరిశీలించారు.

బాధిత రైతుల తో ఎమ్మెల్యే మాట్లాడి  ఎంత వరి పంట సాగు చేశారు తదిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం  ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటల వివరాలను ఆయన సేకరించాలని అధికారులను ఆయ న ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతు లకు నష్టం జరిగితే ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందన్నారు.

బాధిత రైతులు ఎవరు ఆందోళన చెందోద్దని  నష్టపోయిన పంటల కు పరిహారం అందిం చి ఆదుకుంటామని  ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,  ఏవో శ్రీలత, మాజీ జెడ్పిటిసి  శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్  శ్రీనివాస్ గౌడ్,మాజీ ఎంపీటీసీ  పాలకూర్ల ఉమా వతి,శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు యాట నర్సింహా,  బీక్యా నాయక్, బీచ్యా నాయక్, కర్ణాకర్ గౌడ్, సుమన్, రైతులు పాల్గొన్నారు.