07-05-2025 12:19:16 AM
హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణీ సం గమం వద్ద ఈనెల 14వ తేదీ నుంచి జరుగనున్న ‘అంతర్వాహిని’ సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశించారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో మంగళవారం వివి ధ ప్రభుత్వశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మా ట్లాడారు. పుష్కరాలకు తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు లక్షలాదిగా తరలివస్తారని, 12 రోజు లు పాటు త్రివేణీ సంగమ ప్రాంతం కిటకిటలాడుతుందని అందుకు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు.
వృద్ధు లు, గర్భిణులకు ప్రత్యేక వసతులు ఉండాలని ఆదేశించారు. ఈనెల 14వ తేదీ రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన ఘట్టం నుంచి పుష్కరాలు మొదలవుతాయని, మరుసటి రోజు సూర్యోదయం నుంచి భక్తులు పుష్కర పుణ్యస్నా నాలు ఆచరిస్తారని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే పుష్కరాల వెబ్ పోర్టల్, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు.
భక్తు లు ఆయా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నందున.. మహిళా భక్తులు భారీగా పుష్కరాలకు వచ్చే అవకా శం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ యాజమాన్యం బస్సు సర్వీసులు నడపాలని సూచించారు. అనంతరం ఉన్నతా ధికారులు పూర్తయిన పనులు, పెండింగ్‌లో ఉన్న పనులను మంత్రులకు వివరించారు.
సరస్వతీ పుష్కరాల సందర్భంగా ప్రతి రోజు ఒక పీఠాధిపతి త్రివేణీ సంగమంలో పుష్కర స్నానమాచరిస్తారని మంత్రులు తెలిపారు. 15 16వ తేదీల్లో శ్రీగురుమదనానంద సరస్వతీ పీఠం, రంగంపేట, మెదక్ నుంచి మాధవానంద సరస్వతీ స్వామి స్నానమాచరిస్తారని వెల్లడించారు. సమీక్షలో ప్రభుత్వ సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్‌రాజ్, సెర్ప్ సీఈవో దివ్యా దేవ రాజన్ తదితరులు పాల్గొన్నారు.