calender_icon.png 7 May, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవేదనే కాని.. ఆగ్రహం కాదు

07-05-2025 12:50:29 AM

ముఖ్యమంత్రి ముక్కుసూటి మనిషి.. ఆయన మాటల్లో తప్పేమీ లేదు

  1. మాకు ప్రభుత్వాన్ని పాలించే సత్తా ఉంది 
  2. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం 
  3. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం 
  4. ప్రభుత్వ ఉద్యోగులు మా సోదరులే 
  5. అందాల పోటీలు రాష్ట్ర ప్రతిష్ఠను పెంచుతాయి 
  6. స్మితాసబర్వాల్ విషయంలో కక్షసాధింపు లేదు 
  7. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టీకరణ

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): ‘మా ముఖ్యమంత్రి ముక్కుసూటిగా మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదనే వాస్తవ పరిస్థితినే ఆయన చెప్పారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కొందరు బెదిరించినట్లు మాట్లాడటంతోనే ముఖ్యమంత్రి స్పందించారు. ఆయ న మాటల్లో తప్పేమీ లేదు. గత ప్రభు త్వం ఆర్థ్ధిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిం ది.

ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీఎం ఆలా మాట్లాడారు. ఆయన మాటల్లో ఆవేదన ఉందేకాని.. ఆగ్రహం లేదు. మాకు ప్రభుత్వాన్ని నడిపించే సత్తా ఉంది’. అని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మంగళవారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్ నిర్వహంచారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులతో పాటు అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాన్ని గాడిలో పెట్టే పని లో ఉన్నామని తెలిపారు.

ఉద్యోగులంతా మా సోదరులేనని, మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద శత్రుత్వం లేదన్నారు. కొంత ఆలస్యమైనా మేం ఇచ్చిన ప్రతి హా మీ నెరవేరుస్తామన్నారు. ‘ప్రతి పక్షాలు అనే వి విమర్శలు చేస్తూనే ఉంటాయి.. అభివృద్ధిని అడ్డుకుంటూనే ఉంటాయి. గత ప్రభు త్వం ఉద్యోగుల గొంతు నొక్కింది. ఎవరిని మాట్లాడనివ్వలేదు. మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఉద్యోగుల గొంతు నొక్కడం లే దు.

అందుకే  ఉద్యోగుల అభిప్రాయాలను గౌరవిస్తాం.. పరిష్కరిస్తాం. ఉద్యోగుల డిమాండ్స్ ఒక్కొక్కటి  పరిష్కరిస్తాం. మాకు ఇబ్బందులు ఉన్నా మేం అధికారంలోకి రాగానే ఒక డీఏ ఇచ్చాం. మేం హామీలు ఇచ్చేటప్పుడు అన్ని అంచనాలు వేసుకుని హామీ ఇచ్చాం. రాష్ర్ట ఆర్థ్ధిక వ్యవస్థను దివా లా తీయించింది గత ప్రభుత్వమే. మేం అధికారంలోకి రాగానే అప్పులు, రాష్ట్ర ఆర్థ్ధిక పరిస్తుతులపై శ్వేతపత్రం విడుదల చేశాం.

గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఓవరాల్‌గా సీఎం మాటల్లోనే వ్యక్తమైంది. పెట్టుబడులకు వెళ్ళినప్పుడు మన రాష్ర్టంలో ఉన్న వనరులను వివరించి పెట్టుబడులను ఆకర్శించేందుకు ప్రయత్నిస్తాం. విదేశాలకు వెళ్లిన ప్రతిసారి పెట్టుబడులు వస్తాయని చెప్పలేం. అయినా మా ప్రయ త్నం చేస్తున్నాం. రాష్ర్ట అభివృద్ధి కోసం పనిచేస్తాం. ఎన్ని ఇబ్బందులున్నా అధికమించే దిశలో ముందుకు వెళతాం.

ఆదాయ వనరులను పెంచుకునేందుకు అవకాశాలపై సబ్ కమిటీ పని చేస్తోంది. అది నిరంతరం పనిచేస్తుంది. పరిశ్రమలు తెస్తాం ఉద్యోగ  అవకాశాలు కల్పిస్తాం. ముఖ్యమంత్రి మాటలను ఆయన ఆవేదనగా భావించాలి’ అని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.

బీజేపీ నాయకులు నాయకులు పదవి దిగిపోవాలి అంటుంటున్నారని, మరి పహల్గామ్ సంఘటనకు భా ద్యత వహించి బీజేపీనే పదవి నుంచి తప్పుకోవాలి కదా? అని మంత్రి మండిపడ్డారు. దేశ రక్షణ విషయంలో ఎక్కడా రాజీలేదని, తమ పార్టీ నేత రాహుల్‌గాంధీ కూడా ఈ విషయం స్పష్టం చేశారని మంత్రి పేర్కొన్నారు. 

హెలికాప్టర్‌లో ప్రయాణమే తక్కువ ఖర్చు అవుతుంది.. 

ప్రభుత్వం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నదని, దానిని ప్రజా కార్యక్రమాల కోసం వాడుకోవడంలో తప్పేముందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు మంత్రులు కార్లలో వెళితే ఎక్కువ ఖర్చు అవుతుందని, అదే హెలికాప్టర్‌లో ప్రయణిస్తే తక్కువగా ఖర్చు అవు తుందని మంత్రి తెలిపారు. హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నది గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, అయినా కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి బయటికి రాకపోవడంతో వినియోగంచుకోలేదని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు.

‘గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరుగుతోంది. చట్టబద్ధంగా ముం దుకెళ్లాలి కానీ ఎటుబడితే అటు వెళ్లలేం కదా. దేశవ్యాప్తంగా కూడా ఆర్ధిక వ్యవస్థ కొంత ఇబ్బందిగా ఉంది. అయినా రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తున్నాం. ప్రభుత్వ తాజా పరిస్థితులను వివరించే ప్రయత్నమే మా సీఎం చేశారు. ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో వారికి  ఇవ్వాల్సిన బెన్ఫిట్ ఇవ్వాల్సి వస్తుందనే విరమణ వయస్సు పెంచారు.

ఆ ప్రభుత్వంలో ఉన్న పెండింగ్ నిధులతో పాటు ఇప్పుడు  ఉద్యోగ విరమణ చేసిన వారికీ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఐఏఎ స్ అధికారి స్మితా సబర్వాల్ విషయంలో కక్ష సాధింపు లేదు. అధికారులకు కొన్ని నియ మ నిబంధనలు ఉంటాయి, వాటిని అనుసరించాల్సిందే.. విస్మరించరాదు. అందాల పోటీలకు, ఉద్యోగ సమస్యలకు లింక్ పెట్టొ ద్దు.

రాష్ర్ట ప్రతిష్టను ప్రపంచస్థాయిలో  పెం చేందుకు ఈ అందాల పోటీలు ఉపయోగ పెడుతాయి’ అని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రాహుల్ మాటలకు కట్టుబడి కులగణన చేశామన్నారు. సామాజిక న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.  జనాభా గణాంకాలను ఉపయోగించుకుని ఆర్ధిక, సామాజిక, రాజకీయ న్యాయం చేస్తామని తెలిపారు.