calender_icon.png 10 May, 2025 | 10:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందుపాతరకు బలైన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటాం

11-05-2025 12:00:00 AM

  1. మంత్రులు శ్రీధర్‌బాబు,పొన్నం

అధికార లాంఛనాలతో జవాన్ల అంత్యక్రియలు

కామారెడ్డి/మేడ్చల్, మే 9 (విజయక్రాం తి): తెలంగాణ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు మండలం లంకెపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చిన ఘటనలో మృతి చెందిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. శుక్రవారం జవాన్ల అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించారు.

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన జవాన్ సందీప్ అంత్యక్రియలకు ఐటీ శాఖ మంత్రి హాజరై, మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను మంత్రి శ్రీధర్‌బాబు ఓదార్చి, ధైర్యం చెప్పారు. మృతుడి భార్యకు ఉద్యో గం, 300 గజాల ఇంటి స్థలంతోపాటు సోదరుడికి హోంగార్డుగా అవకాశం ఇస్తామన్నారు. మావోయిస్టుల దుశ్చర్యను ఆయన ఖండించారు. 

కామారెడ్డి జిల్లా పాల్వంచలో జరిగిన జవాన్ వడ్ల శ్రీధర్ అంత్యక్రియలకు రవా ణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. శ్రీధర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. శ్రీధర్ కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.2.17 కోట్లతో పా టు 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కాగా శాంతి చర్చలతోనే మావోయిస్టుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని మంత్రి చెప్పారు. కేంద్రం మావోయిస్టుల లేఖలపై స్పందించి, వారితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.