calender_icon.png 2 November, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాలలను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెపుతాం

02-11-2025 01:26:09 AM

మాల సంఘాల జేఏసీ

ఖైరతాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి) : రాష్ట్రంలో మాలలకు న్యాయం జరగాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, గౌరవ అధ్యక్షుడు చెరుకు రామచందర్ల అధ్యక్షతలో శనివారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాల సామాజిక వర్గానికి జరుగుతున్న నష్టంపై గతంలో స్పందించని కొంతమంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాక ర్, ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అనడాన్ని జేఏసీ నేతలు ఖండించారు.

మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాల సోదరులు, సోదరీమణులు ఓడించి తగిన బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధు లు బేర బాలకిషన్, నల్లాల కనక రాజు, తాళ్లపల్లి రవి, తుమ్మ శ్రీనివాస్, మంత్రి నర్సింహా, మాదాసు రాహుల్ తదితరులు పాల్గొన్నారు.