calender_icon.png 23 July, 2025 | 11:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు

23-07-2025 12:34:14 AM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్, జులై 22 : ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. సోమవారం నకిరేకల్ నియోజకవర్గ లోని కేతేపల్లి చిట్యాల మండలాల్లో లబ్ధిదారులకు రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన త్వరత అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు.

రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం ఇస్తుంటే ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక బిఆర్‌ఎస్ నాయకులు అసత్య  ఆరోపణ చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని ఆయన విమర్శించారు.గత ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేశారని విమర్శించారుమన ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నకిరేకల్ నియెజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజురు చేసిందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డిఓ ఆశోక్ రెడ్డి, నల్గొండ డీసీఎంఎస్ చైర్మన్ బోళ్ళ వెంకట్ రెడ్డి, డిసిసిబీ వైస్ చైర్మన్ ఎసిరెడ్డి దయాకర్ రెడ్డి ,నకిరేకల్ , చిట్యాల మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, నర్రా వినోద మోహన్ రెడ్డి, చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, కేతేపల్లి మాజీ జెడ్పిటిసి కోట మల్లికార్జున్ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.