16 April, 2026 | 12:08 PM

Breaking News

వీధి కుక్కల దాడి.. మృత్యువుతో పోరాడి— 15 రోజుల తర్వాత బాలుడు మృతి   •   కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •  

ఈహెచ్‌ఎస్‌కు జీతాల్లో కటింగేంటి?

26-02-2026 12:26 AM
  1. ఇప్పటికే సీపీఎస్ కోసం 10 శాతం.. మళ్లీ 1.5శాతం కోతనా..?
  2. సీఎస్‌కు సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వినతి

హైదరాబాద్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): నూతన ఈహెచ్‌ఎస్ స్కీంకు తమ జీతాల నుంచి 1.5 శాతం చందా కట్ చేయడం దారుణమని సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు సీఎస్‌ను బుధవారం కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. అసలే సీపీఎస్ స్కీంతో రిటైర్‌మెంట్ తర్వాత వచ్చే నామమాత్రపు పెన్షన్‌తో వృద్ధాప్యంలో పూటగడవడమే తమకు కష్టంగా మారిందని, ఇలాంటి దుస్థితిలో తమకు ఉచిత ఆరోగ్య భద్రత కల్పించకుండా తమ జీతా ల నుంచి కట్ చేయడం సరైంది కాదన్నారు.

ఇప్పటికే సీపీఎస్ కోసం పది శాతం కోత విధిస్తున్నారన్నారు. ఉద్యోగవిరమణ పొందిన తర్వాత కూడా ఉచిత ఆరోగ్య భీమా సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఉద్యోగులతో చర్చలు జరిపే జాయిం ట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఒక్కరు కూడా సీపీఎస్ సం ఘం నుంచి ప్రతినిధి లేకపోవడం బాధాకరమన్నారు. తమ డిమాండ్లకు అనుగుణంగా ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేయాలనిన్నారు. నా యకులు కల్వల్ శ్రీకాంత్, నరేష్‌గౌడ్ పాల్గొన్నారు.