26 February, 2026 | 4:12 AM

ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు షురూ

26-02-2026 12:25 AM

తొలిరోజు 96.90 శాతం నమోదు

సంగారెడ్డి, ఫిబ్రవరి 25 :జిల్లాలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భా గంగా బుధవారం ప్రథమ సంవత్సరం తెలు గు, హిందీ, ఉర్దూ, సంస్కృత భాషా పేపర్ల పరీక్షలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయ ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గో వింద్ రామ్ తెలిపారు. మొత్తం 18,179 మంది విద్యార్థులకు గాను 17,616 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో జనరల్ కోర్సుకు చెందిన 16,438 మంది, వృత్తి (వొకేషనల్) కోర్సుకు చెందిన 1,178 మంది వి ద్యార్థులు ఉన్నారు. మొత్తం 563 మంది వి ద్యార్థులు గైర్హాజరయ్యారు.

అందులో జనరల్ కోర్సుకు చెందిన 414 మంది, వృత్తి కో ర్సుకు చెందిన 149 మంది విద్యార్థులు ఉ న్నారు. కాగా మొత్తం హాజరు శాతం 96.90 గా నమోదైంది. ఎటువంటి మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపా రు. పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు కన్వీనర్, డీఐఈఓ 2 పరీక్ష కేంద్రాలను, డీఈ సీ సభ్యులు 11 కేంద్రాలను, హెచ్పీసీ సభ్యు లు 4 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్లు 11 కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్లు 8 కేంద్రాలను తనిఖీ చేసినట్లు గోవింద్ రామ్ తెలిపారు. 

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్..

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య బుధవారం పరీక్షల తొలి రోజున జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, షాహిన్ జూనియర్ కళాశా లలో కొనసాగుతున్న పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాళ్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును, పరీక్షల నిర్వహణ విధానాన్ని నిశితంగా పరిశీలించారు.

విద్యార్థుల హాజరు వివరాలను ఆరా తీశారు. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోనే ప్రశ్నా పత్రాలను తెరిచారా లేదా అన్నది పరిశీలించారు. సీసీటీవీ నిఘా మధ్య ఎలాంటి అవక తవకలకు తావు లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారా అనే విషయాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సం బంధిత అధికారులను ఆదేశించారు.

పరీక్షలు పూర్తున వెంటనే ఆన్సర్ షీట్లను తగిన పోలీసు బందోబస్తు మధ్య నిర్దేశిత కేంద్రాలకు సురక్షితంగా తరలించాలని సూచిం చారు. ఎలాంటి కాపీయింగ్కు అవకాశం లే కుండా పూర్తి పారదర్శకతతో, పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.