calender_icon.png 30 July, 2025 | 2:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ షెడ్లకు అనుమతులేవి?

30-07-2025 01:50:36 AM

*కాప్రాలో అనుమతుల్లేకుండా షెడ్లు 

*నిద్రమత్తులో టౌన్ ప్లానింగ్ అధికారులు

- పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ షెడ్లు

- ఇష్టానుసారంగగా వ్యవహరిస్తున్న షెడ్ ఓనర్స్

- పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు

- అధికారులకే సవాలు విసురుతున్న నిర్మాణదారులు

- కుర్చీలకే పరిమితం అవుతున్న అధికారులు

కాప్రా, జులై 29 : అక్రమ షెడ్ నిర్మాణాలకు కాప్రా సర్కిల్ అడ్డాగా మారింది. అడిగే వారు లేక అక్రమ షెడ్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడక పోవడంతో అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అక్రమ నిర్మాణాలు జరగ కుండా చూసుకోవాల్సిన అధికారులు కాసులకు కక్కుర్తి పడి అక్రమ షెడ్లకు ఆజ్యం పోస్తున్నారు.

కాప్రా డివిజన్ పరిధిలోని హైటెన్షన్ నుండి శైలి గార్డెన్ వెళ్లే ప్రధాన రహదారిలో ఎలాంటి అనుమతి లేకుండా భారీ అక్రమ షెడ్డు నిర్మాణం జరుగుతున్నప్పటికీ అధికారుల మౌనంపై సర్వత్ర విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. కాప్రా సర్కిల్ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి. కానీ, అక్రమా ర్కులు నిబంధనలు తుంగలో తొక్కి అధికారుల అండదండలు ఉండడంతోనే పనులు కానిచ్చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి భారీగా గండి పడుతుంది.

అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని.. కఠిన చర్యలు తీసుకుం టామని చాలా సందర్భాల్లో అధికారులు చెబుతున్నారు కానీ అవేవి ఆచరణలో సాధ్యం కావడంలేదు. భారీ షెడ్‌లు నిర్మిస్తున్న పట్టించుకోని అధికారులు, ఒక సామాన్యుడు ఇళ్ల నిర్మిస్తే కూల్చేస్తారు. కానీ, డబ్బు, అధికార బలం ఉన్న నిర్మాణాదారుల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం తప్ప అక్రమ షెడ్ల పై ఎలాంటి చర్యలు తీసుకున్న పాపాన పోకపోగా.. అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు చెబుతున్నారు.

భారీ అక్రమ షెడ్ల నిర్మాణాలపై అధికారులను వివరణ కోరగా మున్సిపాలిటీ పరిధిలోని అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయా ఆ విషయం ఇంకా మా దృష్టికి రాలేదం టూ తెలియని స్థితిలో అధికారులు వ్యవహరిస్తున్నా రు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న నిర్మాణాదారులపై, అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ అక్రమ షెడ్ నిర్మాణాలకు స్థానిక మున్సిపాలిటీ నుంచి ఎలాం టి అనుమతులు తీసుకోకపోగా చకచకా నిర్మాణాలు చేపట్టి కమర్షియ ల్ షాపులకు, ఇతరులకు కిరాయికి ఇచ్చి లక్షలలో పోగు చేసుకుంటున్న క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారు లు, సిబ్బంది తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టడంతో మున్సిపల్ ఆదాయానికి లక్షల్లో గండిపడుతుంది.

అక్రమ షెడ్ నిర్మాణాలు సహించేదేలేదు

వివరణ కోరగా ప్రస్తుతం ము న్సిపాలిటీలోని అక్రమ షెడ్ల నిర్మాణంపై తనిఖీలు నిర్వహిస్తాం. ఈ అక్రమ షెడ్ నిర్మాణం ఇంకా మా దృష్టికి రాలేదు, తనిఖీలు నిర్వహించి అనుమతులు లేకపోతే తగు చేర్యలు తీసుకుంటామన్నారు.

 కృష్ణ మోహన్, కాప్రా సర్కిల్ డిప్యూటీ సిటీ ప్లానర్