calender_icon.png 4 May, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మదార్సాల్లో ఏం బోధిస్తున్నారు?

03-05-2025 12:59:08 AM

  1. సీఎం సమాధానం చెప్పాలి

లేఖ రాసిన ఎంపీ రఘునందన్

హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని మదార్సాల గురించి, అం దులో ఉన్న బోధన పద్ధతులు, తర్వాత వా రేం చేస్తున్నారనే అంశాలతో పాటు అక్కడ చదువుకుంటున్నవారు, చదవు చెప్పే వారి జాతీయతపైనా విద్యాశాఖ మంత్రి అయిన సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు కోరారు. ఈ మేరకు ఆయన సీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు.

శుక్రవారం బీజేపీ రాష్ర్ట కార్యాల యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మదర్సాలో 70 మంది విద్యార్థులు ఉన్నారని, వారిలో 65 మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారేనని ఆరోపించారు. పిల్లలు, టీచర్లు ఎక్కడి వారు అని చెప్పడానికి ఆధారాలు కూడా లేవన్నా రు. బంగ్లాదేశ్‌కు సరిహద్దుల్లో ఉన్న బీహార్ కిషన్ గంజ్‌కు బంగ్లా నుంచి చొరబడి స్థానికులను బెదిరించి భూములను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు.

డీజీపీని కలిసి మదర్సాల వివరాలు చెప్పాలని కోరానని అయితే ఇప్పటికీ స్పందన లేదన్నారు. జిన్నారంలో ఉన్న మదర్సా కోదండరాముని ఆలయ స్థలమని తెలిపారు. అనుమతిలేని మదర్సాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని, అలాగే ఇస్నాపూర్‌లో 247మంది నేపాల్ వారికి ఆధార్‌కార్డ్ ఇచ్చారని ఆరోపించారు. సీఎం వారం రోజుల్లో స్పందించకపోతే కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామనని చెప్పారు.