03-05-2025 01:01:26 AM
ఎమ్మెల్సీ కవితను నిలదీసిన విప్ బీర్ల ఐలయ్య
హైదరాబాద్, మే 2 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నా.. సకల జనులకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరిగేలా సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య శుక్రవారం స్పం దించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పు డు సబ్బండ వర్గాలకు కవిత ఎందుకు అండ గా నిలబడలేదని, అధికారం దూరమయ్యాక ఇప్పుడు అందరూ గుర్తుకువచ్చారా అని నిలదీశారు.
పదేళ్ల బీఆర్‌ఎస్ హయంలో పందికొక్కుల్లా ప్రజాధనం దోచుకున్నప్పు డు కవితకు సోయి లేదా అని మండిపడ్డారు. సీఎం, పార్టీ అధ్యక్షుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, మంత్రి పదవులు ఓసీ వర్గం వద్ద ఉన్నప్పుడు కవితకు సామాజిక న్యాయం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.