వర్ధన్నపేటలో చెల్లనిది ఇక్కడ చెల్లుతుందా?
అరూరి రమేష్‌పై కడియం విమర్శలు
బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు గుణపాఠం చెప్పాలని పిలుపు
హనుమకొండ, మే 5 (విజయక్రాంతి): వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర విమర్శలు చేశారు. వర్ధన్నపేటలో చెల్లని రూపాయి వరంగల్‌లో ఎలా చెల్లుతుందని ఎద్దేవా చేశారు. భూ కబ్జారాయుడు అరూరి రమేష్ గెలిస్తే బతుకులు ఆగమవుతాయని అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందిరతో కలిసి ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆశీర్వదించి రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను బొందపెట్టారని అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఓడిపోయాక కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తోందని, కవిత లిక్కర్ కేసులో ఇరుక్కొని తెలంగాణ పరువు తీసిందని విమర్శించారు.
అనంతరం ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడిన మోదీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపదను దోచిపెట్టిందని ఆరోపించారు. మీ ఇంటిబిడ్డగా తనను ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వరంగల్ అభివృద్ధిపై సీఎం ప్రత్యేక దృష్టి: ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డివరంగల్ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు.
ఆదివారం పశ్చిమ నియోజకవర్గంలో ని రాజీపేట మండల పరిధిలోని 61, 62, 63, 47 డివిజన్లలో వరంగల్ ఎంపీ అభ్యర్థి కడి యం కావ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. కాజీపేట అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, కానీ కాంగ్రెస్ హయాంలో అతి తర్వలో కాజీపేట రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. కొద్దిరో జుల్లో కాజీపేట బస్టాండ్ ఏర్పాటు కాబోతోందని వివరించారు. బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ భూ కబ్జాల బాగోతం తెలియంది కాద ని, ఉన్నత విద్యావంతురాలైన కడియం కావ్య ను ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్ర మంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.




