కేంద్రంలో కాంగ్రెస్‌దే విజయం
06-05-2024 02:15 AM
కాంగ్రెస్ సీనియర్ నేత బాలగౌని వెంకటేశ్‌గౌడ్
హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని వెంకటేశ్‌గౌడ్ ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 14 ఎంపీ సీట్లు వస్తాయని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం ఖాయమని పేర్కొన్నారు.




