6 May, 2026 | 2:36 AM

పార్టీ జెండా ఆవిష్కరణ

06-05-2026 01:06 AM

అర్మూర్, మే 5 (విజయక్రాంతి): మేడే వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో సిపిఎం జెండాను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో చికాగో పట్టణంలో అక్కడ కార్మికులు 18 గంటలు పనిచేయాలని యాజమాన్యం ఒత్తిడి తీసుకురావడంతో అక్కడి కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేశారని అన్నారు. యాజమాన్యం పోలీసులు కలిసి సమ్మె చేస్తున్న కార్మికులపై కాల్పులు జరపడంతో అనేకమంది కార్మికులు మృతి చెందారని అన్నారు.

నాటి ఉద్యమంతో యాజమాన్యం దిగివచ్చి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న రోజు మేడేగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని అన్నారు. కాని మన దేశంలో పాలకులు ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరణ చేసి 12 గంటలు పని చేయాలని చట్టం తీసుకొచ్చారని అన్నారు.

మన దేశంలో రైతులు పంట పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా విదేశాల్లో పండుతున్న ధాన్యాన్ని దిగుమతి జీరో శుంకాలతో దిగుమతి చేసుకోవడం వలన మనదేశంలో పంట పండించిన రైతులు పంటలు కొనలేక గిట్టుబాటు ధర లేక అనేక అవస్థలు పడుతున్నారని అన్నారు.  ఈ వాణిజ్య ఒప్పందం వలన మన దేశ రైతులను నిట్ట నిలవన ముంచడానికి అని అన్నారు తక్షణమే ఆ వానిజ ఒప్పందాన్ని రద్దు చేసుకొని మన దేశ రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశాడు. ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు కుతాడి ఎల్లయ్య , ఓంకార్, బాజన్న గంగాధర్, సాయి కుమార్  పాల్గొన్నారు.