calender_icon.png 17 July, 2025 | 12:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత బస్సు ద్వారానే విద్యార్థుల బడిబాట సాధ్యం

16-07-2025 06:59:54 PM

సంస్థాన్ నారాయణపూర్,(విజయక్రాంతి): విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారానే విద్యార్థుల బడిబాట సాధ్యమవుతుందని  ధర్మ సమాజ్ పార్టీ నాయకులు శాంతికుమార్ అన్నారు.బుధవారం నారాయణపూర్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ శాంతి కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 22  లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వీరిలో 90 శాతం మంది విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నారన్నారు.

ప్రతీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూలుకు తీసువెళ్లాలని అన్నారు. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుందని, చదువుపై మరింత శ్రద్ధ పెట్టడం వల్ల ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు.ఈ డిమాండ్ ను వెంటనే నెరవేర్చకపోతే త్వరలో భారీ ధర్నాకు సిద్ధమవుతామని పిలుపునిచ్చారు.