calender_icon.png 21 August, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు ఎంచేశావు పుట్ట

21-08-2025 12:48:10 AM

  1. శ్రీ పాద ఎల్లంపల్లి ప్రాజెక్టే ఇప్పుడు ప్రజలకు జీవనాధారం

డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారమే బ్యారేజీలో నీళ్లు నింపడంలేదు

గోదావరి విలాపం పేరుతో పుట్ట రాజకీయం చేయడం సిగ్గుచేటు

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్

మంథని, ఆగస్టు20(విజయ క్రాంతి) మంథని లో గోదారి నీళ్లచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డప్పుడు పుట్ట మధు మీ ప్రభు త్వంలో ఎంచేశావని, డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదిక ప్రకారమే గోదావరిలో నిర్మించిన మూడు బ్యారేజీల వద్ద నీళ్లు నింపడం లేద ని,గోదావరి విలాపం పేరుతో పుట్ట రాజకీ యం చేయడం సిగ్గుచేటని బుధవారం మం థనిలో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలి ప్రసాద్ అన్నా రు.

ఇప్పుడు తెలంగాణ ప్రజలకు గత కాం గ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు జీవన ఆధారం అయిందని ప్రసాద్ అన్నా రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును వృ ధా చేసి మీ బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గోదావరిపై మేడిగడ్డ, సుందిల, అన్నారం ప్రాజెక్టు లు నిర్మిస్తే ఆ బ్యారేజీలతో రైతులకు ఎలాం టి మేలు జరగలేదని, కేవలం రెండు సంవత్సరంలోనే ఆ బ్యారేజీలు కుంగిపోయా య ని ఆవేదన వ్యక్తం చేశారు.

లక్ష కోట్ల రూపాయలు వృథా చేసిన మీ ప్రభుత్వానికి ప్రజ లు కర్రు కాల్చి వాతపెట్టారని. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ పార్టీని విమర్శించడం సరికాదన్నారు. రాజకీయ స్వార్థం కోసం మంతిని నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి గోదావ రి విలాపం పేరుతో సుందిళ్ల బ్యారేజ్ వద్ద కు వెళ్లి పుట్ట మధు గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని మీడియా సమావే శంలో ఆవేదన చేస్తున్నాడని,

ఆయన రాజకీయ కోణం మంత్రి ప్రజలకు తెలుసా అని, పుట్ట మధు ఎన్ని జిమ్మిక్కులు చేసిన ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి లేదని, మచ్చలేని మా నాయకుడు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పై అసత్య ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో నీకు రాజకీయ మనుగడ ఉండదని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమి టీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ కు డుదుల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశిభూషణ్ కాచే, వేరే వేరే లిం గయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.