బరాజ్‌ల డ్యామేజీ ఎప్పుడు గుర్తించారు?
సెఫ్టీ అధికారి మురళీకృష్ణను ప్రశ్నించిన కమిషన్
హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు బహి రంగ విచారణకు హాజరైన డ్యాం సేఫ్టీ అథారిటీ అధికారి మురళీకృష్ణపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మురళీకృష్ణ సోమవారం అమెరికా నుంచి ఆన్‌లైన్ ద్వారా కమిషన్ ఎదు ట విచారణకు హాజరయ్యారు. కమిషన్ ఈ సందర్భంగా ఆయన్ను ప్రాజెక్ట్ పరిధిలోని మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బరాజ్‌ల భద్రతపై ఆరా తీసింది.
‘బరాజ్‌ల వెనుక నీరు స్టోర్ చేయవచ్చా?’ అని కమిషన్ ఆయన్ను ప్రశ్నించింది. మురళీకృష్ణ అందుకు ‘నీరు స్టోర్ చేయవచ్చు’ అని సమాధానమిచ్చారు. బరాజ్‌ల డ్యామేజీని ఎప్పుడు గుర్తించారని కమిషన్ ప్ర శ్నించింది. ‘2021లో కొత్త డ్యాం సేఫ్టీ చట్టం వచ్చింది. 2022లో డ్యామేజీని గుర్తించాం’ అని మురళీకృష్ణ సమాధానమిచ్చారు.
డ్యామేజీని గుర్తించడం లో ఎందుకు ఆలస్యమైందని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్‌ల డ్యామేజీ వెనుక డ్యాం సేఫ్టీ అధికారుల పాత్ర ఉందని కమిషన్ పేర్కొన్నది. కాగా, కాళేశ్వరం కమిషన్ విచారణకు కొన్నిరోజుల పాటు బ్రేక్ పడనున్నదని సమాచారం. తిరిగి వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలిసింది.






