calender_icon.png 1 June, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సబ్ ట్రెజరీ కార్యాలయం ప్రారంభం చేసేదెన్నడో?

30-05-2025 01:05:30 AM

- వానాకాలంతో.. పాత కార్యాలయంలో సిబ్బంది అవస్థలు

- అధికారుల చొరవతో తక్షణమే ప్రారంభించాలని వేడుకోలు

తుంగతుర్తి, మే 29: గడిచిన కొన్ని సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని పాత సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రోజురోజుకీ పైన స్లాబ్ పెక్కులు, ఊడిపోవడంతో అనుక్షణం కార్యాలయ సిబ్బంది అవస్థలు చవిచూస్తున్నారు.

2020 సంవత్సరంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ ఉద్యోగుల, సిబ్బంది అవస్థలు, మరొక ప్రక్క ఎస్ టి ఓ కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయులు ,విశ్రాంతి ఉపాధ్యాయుల బాధలు స్వయంగా చూసి డిఎంహె టి నిధుల ద్వారా నూతన భవనం నిర్మాణం కోసం సుమారు 15 లక్షల నిధులు మంజూరు చేశారు.

నాటి నుండి నేటి వరకు 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ, పూర్తి స్థాయిలో భవన నిర్మాణం అందుబాటులోకి రాకపోవడంతో, పాత కార్యాలయంలో ఒక పక్క మహిళా ఉద్యోగులు, కనీసం బాత్రూం వెళ్లడానికి ఏకంగా ప్రభుత్వ పాఠశాల టాయిలెట్స్ ను వినియోగించుకున్నారంటే, పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో అర్థం అవుతున్నది.

ప్రస్తుతం ఉన్న కార్యాలయం పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలుతుందో అని సిబ్బంది భయభ్రాంతులకు గురవుతున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చిన్న ,చిన్న పనులు నూతన భవనంలో చేపటకపోవడంతో ప్రారంభానికి నోచుకోలేదని సంబంధిత కాంట్రాక్టర్ చెబుతున్నారు.

తక్షణమే జిల్లా అధికారులు యుద్ధ ప్రాతిక పై కాంట్రాక్టర్ తో పనులు నిర్వహించి, తక్షణమే ప్రారంభింప చేయాలని కార్యాలయ ఉద్యోగస్తులు, సిబ్బంది, స్థానిక ఉద్యోగస్తులు, కాంట్రాక్టర్లు కోరుతున్నారు.

కాంట్రాక్టర్ వివరణ.. 15 రోజుల్లో నూతన భవనాన్ని అందుబాటులోకి తెస్తాం. భవనంలోని కిటికీలకు ఇనుప గ్రిడ్స్ పెడుతున్నాము. దీనితోపాటు ఒక చిన్న సంపు ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరలో పనులు పూర్తి చేసి, నూతన భవనాన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.