calender_icon.png 9 November, 2025 | 11:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనసు బాగాలేనప్పుడల్లా శ్మశానానికి వెళ్తుంటా!

09-11-2025 12:13:29 AM

కామాక్షి భాస్కర్ల.. సినీరంగ సౌందర్యారాధకులకు పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తూ ఉండే ఈ అందాల రాక్షసి ‘పొలిమేర’ సినిమాలో డీగ్లామర్ పాత్రలో కనిపించేందుకు ఏమాత్రం జంకలేదు.. ప్రేక్షకులూ ఆదరించారు. ఎందుకంటే, ఆ సినిమాలో తన నటనతో ఒక రేంజ్‌లో భయపెట్టేసిందీ భామ. ఇప్పుడు ‘12 ఏ రైల్వేకాలనీ’లో సందడి చేసేందుకు వస్తోంది.

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం నవంబర్ 21న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కథానాయిక కామాక్షి భాస్కర్ల ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొం టోంది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తనకున్న వింత అలవాటు గురించి చెప్పి షాకిచ్చింది. మనసు బాగాలేనప్పుడు తాను శ్మశానానికి వెళ్తానని కామాక్షి చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. “నాకు లోగా, డిప్రషన్‌గా అనిపించిన ప్పుడు శ్మశానానికి వెళ్తూ ఉంటా.

అక్కడికి వెళ్తే, బూస్ట్ అప్ అవుతా. మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది” అని చెప్పుకొచ్చింది. ‘చాలా మందికి చాలా రకాల అలవాట్లుంటాయి. కానీ, కామాక్షికి ఉన్నది వింతలకే వింతైన అలవాటు’ అని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. ఇక ‘12 ఏ కాలనీ’ విషయానికొస్తే.. పొలిమేర, పొలిమేర2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రానికి నాని కాసరగడ్డ దర్శకుడు. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చు తుండగా, కుశేంద్ర రమేశ్‌రెడ్డి డీవోపీగా పనిచేస్తున్నారు.