26 March, 2026 | 2:48 AM

బీసీ సబ్ ప్లాన్ నిధులేవి?

26-03-2026 12:00 AM

ప్రొ. సంగని మల్లేశ్వర్ :

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026--27 వార్షిక బడ్జెట్ గ ణాంకాలు సామాజిక సమతుల్యతను చాటుతున్నాయని పాలకపక్షం చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల నుంచి ‘బీసీ సబ్ ప్లాన్ నిధులేవీ?’ అన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. బీసీ సంఘాలు ఆశించిన విధంగా సబ్ ప్లాన్ కోసం రూ.20,000 కోట్లు కేటాయించకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీ యాంశమైంది.

ఈ సబ్ ప్లాన్ నిధులను జనాభా నిష్పత్తి ప్రకారం కేవలం వెనుకబడిన తరగతుల సంక్షేమం, అభివృద్ధి కో సం మాత్రమే ప్రత్యేకించి వెచ్చిస్తారు. బీసీ విద్యార్థుల కోసం గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణ, విదేశీ విద్యానిధి వంటి విద్యా పథకాలకు, కులవృత్తుల ఆధునీకరణకు, చేతివృత్తుల వారికి అవసరమైన పనిముట్లు, రాయితీలతో కూడిన రుణాల పంపిణీకి ఉపయోగిస్తారు.

అంతేకాకుండా, బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మా ణం, స్వయం ఉపాధి పథకాల ద్వారా నిరుద్యోగ యువతకు ఆర్థిక భరోసా కల్పించడం వంటి మౌలిక సదుపాయాల కల్ప నకు ప్రధాన వనరుగా పనిచేస్తాయి. ఇతర అవసరాలకు ఈ నిధులు మళ్లించకుండా, కేవలం నిర్దేశించిన లక్ష్యాల కోసమే ఖర్చు చేయడం సబ్ ప్లాన్ ప్రధాన ఉద్దేశం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యధిక జనాభా కలి గిన వర్గాలకు బడ్జెట్ కేటాయింపుల్లో ప్రా ధాన్యత కల్పించడంలో ప్రభుత్వం తన దార్శనికతను మరింత స్పష్టంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 

బడ్జెట్ కేటాయింపులు

ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన మండలిలో రూ.3,24,234 కోట్లతో బడ్జె ట్ ప్రతిపాదనలు చేశారు. ఇందులో నిర్వహణ వ్యయం కింద రూ.2,34,406 కో ట్లు, మూలధన పద్దు కింద రూ.47,267 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమం కోసం రూ.12,511 కోట్లు కేటాయించడం ద్వారా గత బడ్జెట్ కంటే దాదాపు 10 శా తం నిధులను పెంచినట్లు ప్రభుత్వం పే ర్కొంది.

గత ఏడాదితో పోలిస్తే రూ.1,106 కోట్ల నిధులు అదనంగా కేటాయించడం సానుకూల అంశమే అయినా, బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ ముందు ఇవి చిన్నవిగానే కనిపిస్తున్నాయి. ఎస్సీలకు రూ.11,784 కోట్లు, ఎస్టీలకు రూ.7,971 కోట్లు, మైనార్టీల కోసం రూ.3,769 కోట్లు కేటాయించి ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించామని చెబుతున్నది. అయితే, నిధుల కేటా యింపుతో పాటు వాటిని పూర్తిస్థాయిలో ఖర్చు చేసినప్పుడే ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది.

రైతులకు భరోసా

గ్రామీణ జీవన ప్రమాణాలను పెంచే దిశగా వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించారు. రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.9,000 చొ ప్పున రెండు పంటలకు కలిపి రూ. 18,000 అందిస్తామనే భరోసాను ప్రభు త్వం కల్పించింది. సన్న రకం వరి సాగుకు బోనస్ నిధులను గత ఏడాది కంటే రెండింతలు చేయడం విశేషం. పంటల భీమా కోసం రూ.1,886 కోట్లు కేటాయిం చి రైతులకు అండగా నిలిచారు.

గతంలో రాజకీయ కారణాలతో ఆగిపోయిన బీమా పథకాన్ని పునరుద్ధరించడం రైతులకు ఊరటనిచ్చే అంశం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటి ష్టంగా ఉంటేనే పల్లెలు స్వయం పోషకంగా మారుతాయనే లక్ష్యంతో గ్రామాలకు రూ.33,688 కోట్లు కేటాయించారు. కుటీ ర పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ ఉపాధిని పెంచేందుకు బడ్జెట్‌దీతిజిజిలో ప్రతిపాదనలు చేశారు.

విద్య, వైద్యం విషయంలో 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న విద్యాశాఖకు రూ. 26,674 కోట్లు కేటాయించడం ద్వారా ప్రభుత్వం తన ప్రాధాన్యతను చాటుకున్నది. ఆరోగ్య రంగానికి కూడా చరిత్రలోనే అత్యధిక కేటాయింపులు చేయడం గమనారం. ఆరు గ్యారెంటీల అమలు కోసం ఏకంగా రూ. 50,713 కోట్లు ప్రతిపాదించి ప్రజల సం క్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నా రు. అయితే, నిరుద్యోగుల కోసం ఉద్దేశించిన రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

గతేడాది చివరి నిమిషంలో ఈ స్కీమ్ ర ద్దు కావడంతో వేలాది మంది యువకులు నిరాశకు లోనయ్యారు. ఈ బడ్జెట్‌లో ఆ పథకానికి రూ.6,000 కోట్లు కేటాయించినప్పటికీ, అది సక్రమంగా అమలు అవు తుందా లేదా అన్నది వేచి చూడాలి. యూ నివర్సిటీల కేటాయింపుల విషయంలో గ్రామీణ విశ్వవిద్యాలయాలకు నిధుల కోత విధించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతంగా ఉండగా తెలంగాణ జీఎస్డీపీ 10.7 శాతంగా నమోదు కావడం గమనారం.

ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వ సమర్థత కు నిదర్శనమని పాలకపక్షం చెబుతోం ది. సుమారు రూ.1.15 కోట్ల పేద కుటుంబాలకు కూడు గూడు, జీవిత భీమా కల్పించ డం ద్వారా బడ్జెట్‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. దళిత, గిరిజన, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఈ పద్దులు రూపొందించారు. గత 2025 వార్షిక బడ్జెట్‌లో కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదనే విమర్శ లు ఉన్న నేపథ్యంలో, ఈసారి అంకెలకు పరిమితం కాకుండా ఆచరణలో చూపాలని ప్రజలు కోరుకుంటున్నారు.

ఆదాయ మార్గాలను పెంచుకుంటూనే ఉపాధి కల్పనపై దృష్టి సారించిన బడ్జెట్, తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది. అణగారిన వర్గాల కోసం కేటాయించిన నిధులు కేవ లం అంకెల గారడీగా మిగిలిపోకుండా ఆయా వర్గాలకు నేరుగా చేరాలి. బీసీ సబ్ ప్లాన్ వంటి డిమాండ్లపై ప్రభుత్వం తక్షణం స్పందించి సామాజిక సమతుల్యతను కా పాడాలి.

విపక్షాల విమర్శలకు తావులేకుం డా కేటాయించిన ప్రతి రూపాయిని సక్రమంగా ఖర్చు చేసినప్పుడే బడ్జెట్ ఆశించిన ఫలితాలను ఇస్తుంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చి న గ్యారెంటీలను అమలు చేస్తూనే ప్రగతి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే సవాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముం దుంది. అన్ని కులవృత్తుల వారికి, పేదలకు సమన్యాయం జరిగినప్పుడే బడ్జెట్ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది.

 వ్యాసకర్త, కేయూ జర్నలిజంశాఖ విభాగాధిపతి,

సెల్: 98662 55355