calender_icon.png 2 November, 2025 | 12:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌లో ముస్లిం ఓట్లు ఎటువైపు?

24-10-2025 12:00:00 AM

కోలాహలం రామ్ కిశోర్ :

బీహార్‌లో రాష్ర్ట శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయా లు మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచార పర్వంలో మునిగి తేలుతున్నాయి. 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్‌కు వచ్చే నెల 6,11వ తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధా న పోరు ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష మహాఘట్ బంధన్ కూటమి మధ్యనే ఉండ నుంది.

ఎన్డీయే కూటమిలో బీజేపీ, జేడీ యు ప్రధాన పార్టీలు కాగా.. ఇండియా కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్ కీలకం కానున్నాయి.ఇప్పటికే ఆయా కూటమిలోని పార్టీలు అభ్యర్థులకు కేటాయించిన స్థానా ల నుంచి నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేసి ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రచారం జోరు ఎంతగా ఉన్నప్పటికీ ఎన్నికలను శాసించేది మాత్రం సామాన్య జన మే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి జరిగింది..

రాబోయే ఐదేళ్లలో ఎవరిని గెలిపిస్తే మెరుగైన ప్రయోజనాలు పొందవచ్చ నేది ఓటర్ల చేతుల్లోనే ఉంది. కాబట్టి అంతిమంగా ఓటర్లే ఏ కూటమికి అధికారం కట్ట బెట్టాలన్నది నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఈసారి బీహార్ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు కూడా కీలకంగా మారనున్నాయి.

బీహార్ జనాభాలో 17.7 శాతం ఉన్న ముస్లింలు ఈసారి ఎన్నికల్లో ఎటువైపు మొగ్గుతారనేది ఆసక్తికర అంశం. రోజురోజుకు మారుతున్న రాజకీయాలకనుగుణం గా ఫలితాలు ఇలాగే వస్తాయని మాత్రం చెప్పలేం. ఇప్పటికే విపక్ష నేత రాహుల్ గాంధీ ‘ఓట్ అధికార్ యాత్ర’ పేరుతో ఈసీపై ఆరోపణలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో ముస్లిం సమాజం ఓట్లు ఎటు వెళ్తాయనేది చెప్పలేని స్థితి.

ప్రాతినిధ్యం తక్కువే

బీహార్ జనాభా సుమారు 13 కోట్లు. అందులో ముస్లిం జనాభా 17.7 శాతం. ఉత్తర బిహార్‌లో 70 శాతం ముస్లింలు నివసిస్తున్నారు. సీమాంచల్ ప్రాంతం కీల కం. కతిహార్, పుర్నియా, అరారియా జిల్లా ల్లో ముస్లిం జనాభా 40 శాతం వర కు పెరిగింది. కిషన్‌గంజ్ జిల్లాలో 68 శాతం ముస్లింలు ఉన్నారు. 87 నియోజకవర్గాల్లో 20 శాతానికి మించి ముస్లింలు ఉన్నారు. ఈ ఓట్లు 80 సీట్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే బీహార్‌లోని ముస్లిం లు పేదరికం, నిరక్షరాస్యతలో చాలా వెనుకబడ్డారు. వారిలో 73 శాతం పస్మందా ముస్లింలు. ఇవి వెనకబడిన వర్గాలు. ఈ వర్గం నుంచి రాజకీయ ప్రాతినిధ్యం తక్కు వ. అయితే బీహార్ చరిత్రలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువగానే ఉంది. 1952 నుంచి 2020 వరకు 17 ఎన్నికల్లో 390 మంది ముస్లిం శాసనసభ్యులు మాత్రమే ఎన్నికయ్యారు. ఇది మొత్తంగా చూస్తే 7.8 శాతం మాత్రమే.

1985లో ఉమ్మడి బీహార్‌లో 34 మంది ఎన్నికయ్యారు. అప్పుడు చట్టసభల్లో ముస్లింల ప్రాతినిధ్యం బలం 10 శాతానికి పైగా పెరిగింది. అదే మొదలు.. అదే చివరిసారి కూడా. 2020 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 243 సీట్లలో 19 మంది మాత్రమే ముస్లిం అభ్యర్థులు ఉన్నారు. పస్మందా ముస్లింల నుంచి 2020లో ఐదుగురు మాత్రమే ఎన్నికయ్యారు. నలుగురు ఏఐఎంఐఎం నుంచి, ఒకరు ఆర్‌జేడీ నుంచి ఉన్నారు. ఇక బీహార్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి ముస్లింలకు ఒక్కసారి మాత్రమే వరించింది.

1970లో అబ్దుల్ గఫూర్ ముఖ్య మంత్రి అయ్యారు. కానీ పార్టీలో విభేదాల కారణంగా రెండేళ్లు కూడా ఆయన సీఎం పదవిలో కొనసాగలేకపోయారు. ఇక బీహార్‌లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ముస్లిం అభ్యర్థి ఉపముఖ్యమంత్రి అయిన దాఖలాలు లేవు. మంత్రి పదవుల్లోనే కేవలం నాలుగు నుంచి ఐదు మాత్రమే దక్కేవి. అయితే స్పీకర్, చైర్మన్ పదవులు మాత్రం కొందరిని వరించాయి.కొందరికి వచ్చాయి. కానీ గత నాలుగు దశాబ్దాలుగా ఇందులోనూ ముస్లింల ప్రాధాన్యత తగ్గుతూనే వస్తుంది.

ఓట్ల తొలగింపు ప్రభావం

ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం అభ్యర్థులు తక్కువే ఉన్నారు. బీజేపీ అయి తే ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వలేదు. జేడీ(యూ) నాలుగు సీట్లలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టగా.. ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీలు మొత్తంగా ఐదుగురు ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది. వీరిని ముస్లిం మెజారిటీ సీట్లలోనే నిలబెట్టారు. ఆర్‌జేడీ ప్రకటించిన 143 మందిలో 18 మంది ముస్లింలు ఉ న్నారు.

ఏఐఎంఐఎం 25 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్, జేడీ(యూ), ఎల్‌జేపీ ముస్లిం అభ్యర్థుల సంఖ్యను తగ్గించాయి. మొత్తం ముస్లిం ప్రాతినిధ్యం జనాభాకు సరిపడదు. దాదాపు అన్ని పార్టీ లు ఎలాంటి మినహాయింపు లేకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం కూడా ఇక్కడ పెద్ద సమస్య గా మారిపోయింది. ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) పేరుతో బీహార్‌లో దాదాపు 65 లక్షల ఓట్లు తొలగించారు.

అందులో ముస్లింలు 24.7 శాతం (ఇది సుమారు 16 లక్షలు). ముఖ్యంగా ఓట్ల తొలగింపు ప్రభావం సీమాంచల్ ప్రాం తంలో ఎక్కువగా కనిపిస్తుంది. ధాకా నియోజకవర్గంలో 80 వేల ముస్లిం ఓట్లు తొలగించే ప్రయత్నాలు జరిగాయి. అయితే దీనిపై ఎన్నికల కమిషన్ ఇంతవరకు స్పందించలేదు. మతం డేటా ను మేము ట్రాక్ చేయలేమని, అది సున్నితత్వంతో కూడుకుందని ఈసీ పేర్కొంది. అయితే ముస్లిం సమాజంలో మాత్రం ఓటుపై భయాలు పెరిగాయి. ఇది ఎన్నికల ఫలితాలను ఎంత మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

లాభం ఎవరికీ?

అసెంబ్లీ ఎన్నికలకు ముందే ముస్లిం ఓట్లలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. గతంలో మై (ముస్లిం- కాంబినేషన్ ఆర్జేడీకి బలాన్ని ఇచ్చింది. 1990లలో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ముస్లింలో మద్దతు బాగానే దొరికింది. ఇప్పుడు కూడా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారని ప్రీ ఎలక్షన్ సర్వే సంస్థ లు పేర్కొంటున్నాయి. నిజానికి బీజేపీ కూడా ముస్లిం జనాభా ఓట్లను ఏ మాత్రం ఆశించటం లేదు.

కనుక బీహార్‌లో ముస్లిం ఓట్లన్నీ దాదాపు మహాఘట్ బంధన్ కూ టమివైపే మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. సీమాంచల్‌లో ముస్లింలు కులాలు, భాషలు, ఇస్లామిక్ మూవ్‌మెంట్ల ప్రకారం విభజన ఉంటుందన్న వార్తలు ఉన్నాయి. అయితే ఏఐఎంఐఎం, ప్రశాంత్ కిషోర్ ‘జన్ సురాజ్’ పార్టీలు కూడా కాస్తో కూస్తో ప్రభావం చూపనుండడంతో ఓట్లు చీలే అవకాశమైతే బాగానే ఉంది. అయితే టెస్ట్ సర్వేలు ఆసక్తికరంగా ఉన్నాయి.

ఒక పో ల్‌లో ఎన్డీయే, ఇండియా కూటముల మ ధ్య ఓట్ల శాతం తేడా 1.6 శాతంగా ఉంది. ఇందులో ఎన్డీయే ముందుంటే.. మరో సర్వేలో ఎన్‌డీఏ ఫ్రంట్ రన్నర్‌గా ఉంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పీడీఏ (పస్మం దా, దళిత, అడివాసి) స్ట్రాటజీ ప్లాన్‌ను అ మలు చేస్తున్నారు. ముస్లిం ఓట్లు ఇం డియా కూటమికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఓట్ల తొలగింపు దీనిపై ప్రభావం చూ పవచ్చు. ఇక ఎన్డీయే కూటమి మాత్రం  తన కోర్ ఓటర్లపై దృష్టి సారించింది.

మొత్తంగా ముస్లిం సమాజంలో అసంతృప్తి పెరుగుతోంది. సెక్యులర్ పార్టీలు వాటిని ఉపయోగించుకుంటున్నప్పటికీ పార్టీలో వారికిస్తున్న ప్రాతినిధ్యం మాత్రం అంతంతమాత్రంగానే ఉంటుంది. అభివృద్ధి, సం క్షేమ పథకాలు ఇబ్బడిముబ్బడిగా ప్రకటించినా సరిగ్గా అమలవుతున్నాయనేందుకు ఆధారాలు లేవు.

ఈ భయం ముస్లిం ఓట్లను ఏకీకృతం చేస్తుంది. ఏఐఎంఐఎం వంటి పార్టీలకు కొంతమేర లాభదాయకంగా మారవచ్చు. అది జరిగితే మాత్రం ఇండియా కూటమికి నష్టం తప్పదు. రా నున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎ వరివైపు మొగ్గుతారన్నది ఆసక్తికరం. తుది ఫలితం ఎలా ఉంటుందనేది చూడాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.

 సెల్: 9849328496