10-10-2025 01:20:33 AM
భారత కెప్టెన్‌గా గాడిపల్లి ప్రశాంత్
హైదరాబాద్,అక్టోబర్ 9(విజయక్రాంతి): ప్రపంచ క్రీడారంగంలో తెలంగాణ ప్రతిభ మరోసారి మెరిసింది. వరల్డ్ పారావాలీబాల్ వరల్డ్ కప్ 2025లో భారత జట్టు కెప్టెన్‌గా తెలంగాణకు చెందిన గాడిపల్లి ప్రశాంత్ ఎంపికయ్యాడు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన ప్రశాంత్ గత కొన్నేళ్ళుగా సిట్టింగ్ వాలీబాల్‌లో రాణిస్తున్నాడు.
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఐదుసార్లు జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 2023లో ఈజిప్ట్‌లోని కైరో వేదికగా జరిగిన పారావాలీబాల్ వరల్డ్‌కప్‌లో భారత్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పుడు అమెరికాలోని ఇండియానా స్టేట్ వేదికగా జరగబోయే వరల్డ్ పారావాలీబాల్ వరల్డ్ కప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ప్రశాంత్‌కు కోచ్‌లు సింగారపు బాబు,నాగేశ్వరరావు, శాట్స్ , తెలంగాణ పారాస్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.