calender_icon.png 19 July, 2025 | 1:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్టుగుట్ట వీరభద్రుడి శిల్పమెక్కడ?

15-07-2025 12:00:00 AM

శ్రీరామోజు హరగోపాల్ :

దేవాలయ నిర్మాణ ప్రణాళికలో భాగంగా వివిధ స్థానాల్లో ప్రతిష్ఠంచదగిన శిల్పాలను శిల్పులు చెక్కి సిద్ధపరుస్తారు. సౌందర్య ప్రతీకలుగా, ఆరాధనాప్రతిమలుగా చెక్కిన ప్రతిశిల్పం శిల్పుల కళాప్రతిభకు నిదర్శనం. పూజించినంత కాలం పూజించి, శిల్పానికి ఏదో ఒకచోట కలిగి న విరుపు కారణంగా ఆ విగ్రహం పూజకు పనికిరాదని ప్రతిష్ఠాస్థానాల నుంచి తొలగించి దేవా లయ ప్రాంగణంలో ఒకచోట పెట్టటం కనీస మర్యాద.

కానీ, విరిగిన గ్రహం ఉండడమే అపచారమని, అరిష్టమని చెప్పేవారి కారణంగా.. ఆ చారిత్రక, సాంస్కృతిక చి హ్నాలైన శిల్పాలను తీసుకుని కొందరు నదుల్లో, చెరువుల్లో నిమజ్జనం చేస్తుంటారు. ఇదెంతవరకు సబబు? శిల్పశాస్త్రంలో కూడా శిల్పభంగం జరిగితే పునరుద్ధరణ చేయడానికి అనుమతులున్నాయి. వాటిని ఆలయ ప్రాంగణంలోనే వేరొకచోట పెట్టి, ఏడాదికో, రెండేండ్లకో వాటికి పూజలు చేయాలని శాస్త్రాలు చెప్తాయి.

కొందరు పూజారులు ఏ శాస్త్ర ప్రకారం శిల్పాలను కనబడకుండా నీళ్లలో ముంచే పనెందుకు చేయిస్తున్నారో తెలియదు. కృష్ణా, గోదావరి వెంట చూస్తే వందల దేవాలయాలకు సరిపోయే శిల్పాలు అధ్వానంగా మనకు కనిపిస్తుంటాయి.

హనుమకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ఉండేటి కాకతీయానంత ర కాలానిది, అందమైన అష్టభుజ వీరభద్రుని శిల్పంలో విరుపులున్నాయని, ఆ విగ్రహాన్ని తీసుకునివెళ్లి కాళేశ్వరం వద్ద గంగపాలు చేశారు. దీంతో చారిత్రక శిల్పం మళ్లీ కనిపించకుండాపోయింది. కారకులైన వారినేం చేస్తారు? వాళ్లకేదన్నా అవకరం ఉంటే వాళ్లని గంగలోనే పారేస్తారా ?