బీసీలు ఎటువైపు?
- నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా తెరపైకి బీసీ వాదం
- సామాజిక వర్గాల వారిగా ఓటర్లును లెక్కగడుతున్న సంఘాలు
- అభ్యర్థులను ప్రకటించిన రెండు యూనియన్లు
సూర్యాపేట, డిసెంబర్ 7 (విజయక్రాం తి): గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీవాదం వినబడుతున్న విషయం విధిత మే. 2025 ఫిబ్రవరిలో జరుగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ బీసీవాదం తెరపైకి రావడంతో బీసీ ఉపాధ్యాయ ఓటర్లు ఎటువైపు ఉంటారో అనే అనుమానంతో పలు యూనియన్లు ఆచితూచి అభ్యర్థులను ఎంపి క చేస్తున్నాయి.
సామాజిక వర్గాల వారిగా ఉపాధ్యాయ ఓటర్లను లెక్కగడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2019 మార్చిలో జరిగిన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్‌పై గెలుపొందారు. అలుగుబెల్లి పదవి కాలం మార్చిలో ముగియనున్నది. దీంతో ఎన్నికల సంఘం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
2025 పిబ్రవరిలో ఎన్నికలు జరుగనుండగా.. ఇప్పటి నుంచే ఆయా ఉపాధ్యాయ సంఘాలు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచారం నిర్వహించే పనిలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెత్తం 56 ఉపాధ్యాయ సంఘాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. వీటిలో యూటీఎఫ్, పీఆర్టీయూ, తపస్ ప్రధాన సంఘాలుగా ఉన్నాయి. మరికొన్ని సంఘాలు కలిసి ఉపాధ్యాయ జాయింట్ యాక్షన్ కమిటీగా (జాక్టో) ఏర్పడ్డాయి.
కాగా యూటీఎఫ్ సిట్టింగ్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డినే మరోసారి అభ్యర్తిగా ప్రకటించగా.. పీఆర్టీయూ శ్రీపాల్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. వీరిద్దరు ఓసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, రాష్ట్రంలో బీసీవాదం బలపడటంతో ఇతర సంఘాలు బీసీ అభ్యర్థి వైపు మొగ్గుచూపుతున్నాయి.
బీసీలపైనే ఫోకస్?
అధికార, ప్రతిపక్ష పార్టీలలోని బీసీ నాయకులు కూడా బీసీ గణన జరగాలని, అందుకు అనుగుణంగానే రాజకీయ రిజర్వేషన్లు ప్రకటించాలని గత కొద్ది రోజులుగా బహిరంగానే అంటున్నారు. కాగా విద్యావంతులైన ఉపాధ్యాయ ఓటర్లలో దాదాపు 70 శాతం బీసీలే ఉన్నారు. సుమారు 4,500 మంది ఓసీ, 5 వేల మంది ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 20 వేలకు పైగా బీసీలు ఉన్నారు.
దీంతో బీసీ ఉపాధ్యాయ ఓటర్లు సంఘాల వైపు ఉంటారా.. లేక బీసీ అభ్యర్థుల వైపు ఉంటారా అనే చర్చ జరుగుతున్నది. ఈసారి ఎమ్మెల్సీ ఎలాగైనా దక్కిం చుకోవాలని వ్యూహంలో ప్రధాన ఉపాధ్యా య సంఘాలు పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని సంఘాలు బీసీ అభ్యర్థులను పోటీలో ఉంచాలని భావిస్తునాయి.
ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థులు ఓసీలు కావడం, బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో బీసీ అభ్యర్థి ఎంపిక దిశగా ఇతర సంఘాలు అడుగులు వేస్తున్నాయి. జాక్టో నుంచి మాజీ ఎమ్మెల్సీ పూల రవిందర్ దాదాపు ఖారారైనట్లు తెలిస్తోంది. ఇక తపస్ నుంచి కూడా బలమైన బీసీ అభ్యర్థినే బరిలో ఉంచాలని చూస్తోంది.
30 వేల మంది ఓటర్లు
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాను నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపా ఠి ఇటీవల ప్రకటించారు. ముసాయిదా ప్రకారం మూడు ఉమ్మడి జిల్లాల్లో మొ త్తం 22,254 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. మొత్తం 28,698 మంది ఉపాధ్యాయులు దరఖాస్తు చెసుకోగా వివిధ కారణాలతో 6,114 దరఖాస్తులు తిరష్కరించబడ్డాయి. ఈ నెల 9 వరకు సవరణ లకు అవకాశం ఉండటంతో ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 30 వేలకు చేరే అవకాశం ఉన్నదని తెలుస్తోంది. కాగా ఈ నెల 25న తుది జాబితా విడుదల కానున్నది.




