పాలమూరు జిల్లాలో భూకంపం
08-12-2024 12:27 AM
రిక్టార్ స్కేల్‌పై 3.౦గా నమోదు
మహబూబ్‌నగర్, డిసెంబర్ 7 (విజయక్రాంతి):పాలమూరు జిల్లాలో శని వారం మధ్యాహ్నం 12.14 నిమిషాలకు భూకంపం సంభవించింది. కౌకుంట్ల మండలం దాసరిపల్లి శివారులో పలుచోట్ల భూమి కంపించిందని నేషనల్ ఫర్ సిస్మాలజీ అధికారులు తెలిపారు. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు నివేదికలో పేర్కొన్నారు. రిక్టార్ స్కేల్‌పై 3.0 తీవ్రతతో భూమి కంపించినట్టు వారు తెలిపారు. ఈక్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందోన ని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే.




