17-02-2026 12:41:27 AM
వనపర్తి, ఫిబ్రవరి 16 ( విజయక్రాంతి ) : ఎన్నికల సమయంలోనే విమర్శలు ప్రతి వి మర్శలు ఎన్నికల అనంతరం పట్టణ అభివృ ద్ధి కోసం అందరు కలిసి పని చేయడం వనపర్తి మున్సిపాలిటీ, నియోజకవర్గం కి ప్రత్యేక త. అలాంటి ప్రత్యేకత కలిగిన వనపర్తి నియోజకవర్గం లో ఎమ్మెల్యే మేఘారెడ్డి వెనుక గల ముగ్గురు నాయకులు అంతా తామే అ న్నట్లుగా బీసీ లకు అన్యాయం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ పార్టీ అధ్యక్షులు చీర్ల చందర్ చేసిన వ్యాఖ్య లు వనపర్తి మున్సిపాలిటీ తో పాటు నియోజకవర్గం మొత్తం హాట్ టాపిక్ గా మారింది.
పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ వారికీ కా కుండా కేవలం డబ్బులు ఉన్న వారికీ పదవు లు కట్టబెట్టడం నిజమైన కార్యకర్తలకు అన్యా యం చేస్తున్నారని పలువురు నాయకులు పెదవి విరచడం పట్ల పట్టణంలోని మేధావు లు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలు వేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే వెనుక చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు నేతలు ఎవరు...?
వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి మంచి నా యకుడిగా ఎవరికీ ఏ ఆపద వచ్చిన తాను ఉన్నానంటూ భరోసాను ఇస్తూ అందరితో కలిసి మెలిసి పని చేస్తూ వనపర్తి నియోజకవర్గంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ని త్యం పని చేస్తున్న ఎమ్మెల్యే పట్ల అటు నా యకులకు ఇటు ప్రజలకు మంచి అభిప్రా యం ఉంది.
కార్యకర్తల భాద తెలిసిన వ్యక్తిగా నిరంతరం ప్రజలను కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి వెనుక ముగ్గురు నాయకులు చక్రం తిప్పుతున్నారని వారి వల్ల అన్యాయం జరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ వాఖ్యానించ డం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎవరు ఆ ముగ్గురు నాయకులు అని ఇదంతా ఎమ్మెల్యే దృష్టిలో ఉండి జరుగుతుందా లేక ఎమ్మెల్యే దృష్టిలో లేకుండా జరుగుతుందా అని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. నిరంతరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వెనుక చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు నాయకులను కట్టడి చేయకపోతే భవిష్యత్ లో పార్టీ కి తీరని నష్టం వాటిల్లుతుందని పట్టణంలోని మేధావులు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.
కాంగ్రెస్‌లో మరోసారి భగ్గుమన్నా విబేధాలు?
కాంగ్రెస్ పార్టీ లో మరోసారి విభేదం భగ్గుమంది. వనపర్తి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం దాదాపు 22 ఏండ్ల తరువాత జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడం జరిగింది. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు సీనియర్ నాయకులు తమ సతులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేయగ చివరికి పతుల ప్రయత్నం పలిచింది.
కాగా అనుభవం సీనియారిటీ ఉన్న వారికీ చైర్మన్ పీఠం దక్కుతుందని ఆశించిన ఆశలు ఆవిరి అయిపోగా చైర్మన్ పీఠం కోసం ఆరాటపడిన వారికీ దక్కకపోవడంతో మరొక సారి పార్టీ లో వేభేధాలు భగ్గుమన్నాయి. ఈ విభేదాలు సద్దుమనుగుతాయా లేక త్రీవ స్థాయి కి చేరుకుంటుందా వేచి చూడాలని పట్టణంలోని మేధావులు, ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.