16-05-2025 12:00:00 AM
-కలెక్టర్ అభిలాష అభినవ్
రెవెన్యూ రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల్లో పెండిం గ్లో ఉన్న భూసమస్యలపై వివరాలు తెలుసుకున్నారు.
భూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదు లను తక్షణమే పరిశీలించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అటవీశాఖతో ఉన్న భూ వివాదాలపై రెవెన్యూ, అటవీశాఖల అధికారులు కలిసి సర్వే చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు.
ప్రతి మండలానికి సంబంధించిన భూముల వివరాలతో సమ గ్ర ప్రొఫైల్ తయారు చేయాలని, భూభారతి చట్టాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న కుంటాల మండలంలో ప్రస్తుతం ఉన్న భూ సమస్యల పరిష్కార దశలను కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో అద నపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ కిషోర్ కుమార్, ఆర్డీఓ కోమల్ రెడ్డి, తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.