28-10-2025 12:00:00 AM
ఉత్కంఠకరంగా కరీంనగర్ డీసీసీఎంపిక
కరీంనగర్,అక్టోబర్27(విజయక్రాంతి):కాంగ్రెస్ నాలుగు జిల్లా అధ్యక్షుల, రెండు నగర అధ్యక్ష పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది.. రెండు, మూడు రోజుల్లో అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేదెవరో తేలిపోనున్నది. ముఖ్యమంత్రి రే వంత్రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాంగ్రెస్ అధ్యక్ష పదవులకు, నగర అధ్యక్ష పదవులకు పరిశీలకులు అందించిన పేర్లను టీపీసీసీ అ ధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో సమీక్షించి షార్ట్లి స్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలిసి డీసీసీ అధ్యక్షుల ప్రతిపాదిత జాబితాను అందించి ఆ యా అభ్యర్థుల గురించి చర్చించినట్లు తెలిసింది.కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా లలో ఒక వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి వస్తుందని భావిస్తున్నారు. రా జన్న సిరిసిల్ల డి సి సి అధ్యక్షుడిగా.ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కొనసాగుతున్నారు ఆయన స్థానంలో సిరిసిల్ల ని యోజకవర్గ ఇంచార్జి గా ఉన్న కేకే మహేంద ర్ రెడ్డి , పి సి సి అధికార ప్రతినిధి ఉమేష్ రావులు పోటీ పడుతున్నారు.
ఉమేష్ రావు మాజీ ముక్షమంత్రి కెసిఆర్ కుఅల్లుడు అవుతారు ఆయన 2005లో వై ఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఉమ్మడి రాష్ట్రంలో పి సిసి అధికార ప్రతినిధిగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అధికార ప్రతినిధిగా పార్టీని వీడకుండా సేవలందిస్తు న్న తనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కుతుందన్న ఆశలో ఉన్నారు .
ఇక జగిత్యాల జిల్లా విషయానికి వస్తే జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం సీనియర్ కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నర్సింగా రావు, కల్వకుంట్ల సుజిత్ రావులు పోటి పడుతున్నారు.. నర్సింగా రా వు మాజీ మంత్రి దివంగత రత్నాకర్ రావు కుమారుడు కావడంతో పాటు ఆయన పా ర్టీలో సీనియర్ నాయకుడు కల్వకుంట్ల సుజి త్ రావు యువనాయకుడు, వీటికి తోడు ఎ స్‌సి , బి సి సామాజిక వర్గాల నుండి పోటీ ఉంది. పీఠం ఎవరికి దక్కుతుందో చూడాలికరీంనగర్ డీసీసీ అధ్యక్ష పదవికి మూడు పే ర్లు, నగర అధ్యక్ష పదవికి రెండు పేర్లను ఏఐసీసీకి పంపించిన జాబితాలో ప్రతి పాదించారని తెలిసింది.
కాంగ్రెస్ జిల్లా అధ్య క్ష పదవికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి స త్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు పేర్లను ప్రతిపాదించారని సమాచారం. నగర అధ్యక్ష పదవికి పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్కుమార్, మాజీ కార్పొరేటర్ మాచర్ల ప్రసాద్ పేర్లను ప్రతిపాదించారని తెలిసింది. జిల్లాలకు నియమించే అధ్యక్షులు వారివారి సామాజిక వర్గాలు, ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు ఇచ్చిన నామినేటెడ్ పదవులు పొందినవారి సామాజికవర్గాలు, మంత్రుల సామా జిక వర్గాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారని చెబుతున్నారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేరునే ఖరారు చేసే అవకాశాలు ఎ క్కువగా ఉన్నాయని సమాచారం. ఉమ్మడి జి ల్లా పరిధి నుంచి ఒక ఓసీ, ఒక బీసీ, ఒక ఎస్సీ (మాదిగ) సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విప్గా బీసీ సామాజిక వర్గానికి చెం దిన వారు ఉండడంతో ఆయా సామాజిక వర్గాల్లో ప్రాధాన్యంలేని ఇతరవర్గాలకు అవకాశం కల్పిస్తారని, ఆ సమీకరణాల్లోనే మూ డు జిల్లాలలో ఒక జిల్లా అధ్యక్ష పదవి వెలమ సామాజిక వర్గం వారికి దక్కుయిందని భావిస్తున్నారు.