28-10-2025 12:00:00 AM
హనుమకొండ టౌన్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవం డిసెంబర్ 13, 14 తేదీలలో నాగార్జునసాగర్ విజయపురి సౌత్ లో నిర్వహిస్తున్నామని నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవ కమిటీ బాధ్యులు, పూర్వ విద్యార్థులు సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో తెలిపారు. మాజీ ప్రధాన మంత్రి పి.వి. నరసింహారావు ప్రోత్సాహం, ప్రోద్బలంతో ఈ కళాశాల స్థాపించబడిందని, గురుకుల పాఠశాలలు, కళాశాలలు స్థాపించడంలో పీవీ పాత్ర అనిర్వచనమైనదని పేర్కొన్నారు.
నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీ స్వర్ణోత్సవాలలో భాగంగా డిసెంబర్ 13 న గురువులకు సత్కారము, క్యాంప్ ఫైర్, 14 న స్వర్ణోత్సవ సభ, ఆత్మీయ సమ్మేళనం లో పూర్వ విద్యార్థులందరూ వీలు చేసుకొని, పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ మారెళ్ళ అంజిరెడ్డి, పూర్వ విద్యార్థులు సీనియర్ గుండె వైద్య నిపుణులు డాక్టర్ రామక శ్రీనివాస్, పరకాల ఆర్డిఓ డాక్టర్ కన్నం నారాయణ, చార్టెడ్ అకౌంటెంట్ చంచల్ అగర్వాల్, ఎల్‌ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ స్వామి, వెటర్నరీ డాక్టర్ పల్లె రాజు, డాక్టర్ గన్ను కృష్ణమూర్తి పాల్గొన్నారు.