18-09-2025 01:26:46 AM
మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి
అర్మూర్, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి) : రాష్ట్రంలో యూరియా కొరత రోజు రోజుకు తీవ్రతరం అవుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం త్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన వేల్పూర్ లో విలేకరులతో మాట్లాడుతూ నెలరోజుల నుంచి బిఆర్‌ఎస్ అన్ని వేదికల మీద ప్రభుత్వాని హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రైతులు రేవంత్ రెడ్డిని తిడుతున్నారని, శాపనార్థాలు పెడుతున్నా అయినా కళ్ళు కనిపిస్తలేదా ? అన్నం లేకుండా, నిద్రాహారాలు లేక గంటల తరబడి రైతులు యూరియా కోసం పడిగాపులు పడుతున్నారని వాపోయారు. చెప్పులు లైన్లో , పాస్ బుక్ లు లైన్ లో పెట్టే పరిస్థితి మళ్లీ వచ్చింది. రైతాంగం ఇబ్బంది పాలవుతున్నప్పటికీ చీమ కుట్టినట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండి పడ్డారు.
నిజామాబాద్, బాల్కొండ నియోజకవర్గం లో అన్ని గ్రామాల్లో యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారని, తండాల్లో నుంచి వచ్చి యూరియా తీసుకుపోవడానికి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వానికి కనబడడం లేదని వాపోయారు. ఒక్కో మండలానికి వేయి బస్తాలు అవసరముంటే వంద సంచులు పంపిస్తే ఎవరికి ఇచ్చెదని మండిపడ్డారు. మోర్తాడ్ మండలం డోన్ పాల్ గ్రామంలో పోలీసులను పెట్టీ టోకెన్లు పంపినీ చేశారు. ఎప్పుడైన ఇలా జరిగిందా అని ప్రశ్నించారు.
ఢిల్లీకి మూటలు పంపడం తప్ప వేరే ధ్యాస లేదని ఆరోపించారు. రైతులు యూరియా కోసం అల్లాడుతుంటే అరవింద్ ఎక్కడికి వెళ్లాడు. పెద్ద మాటలు, అడ్డగోలుగా తిట్టే అరవింద్ యూరియా ఎందుకు తెప్పించడం లేదు. మోడీ దగ్గర చాలా విలువ, పలుకుబడి ఉందని చెప్పే నిజామాబాద్ ఎంపి అరవింద్ ఎందుకు మాట్లాడడం లేదు. బీజేపీ 8 మంది ఎంపీలు ఉన్నా ప్రయోజనం లేదు. వెంటనే మోదీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి. కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు ఇలా చూడలేదు. కేసీఆర్ దూర దృష్టి రైతులకు స్వర్ణ యుగంగా విలసిల్లింది. కేసీఆర్ ముందుగానే లెక్కలు వేసి కేంద్రానికి మంత్రుల బృందాన్ని పంపి యూరియా తెప్పించే వారని అన్నారు.
రైతులు యూరియా కోసం ఇంత గోస పడుతుంటే ఎంపీలు గాడిద పల్లు తోముతున్నారా? యుద్ధం వల్ల యూ రియా అందడం లేదని ఒక ఎంపీ మాట్లాడుతున్నాడు. పనికి మాలిన యుద్ధం వలన యూరియా కొరత వచ్చిందని సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మోడీ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకురావాలి. రైతులు తిరగబడితే ఎంపీలు రాజీనామా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. యూరియా బస్తా ఇప్పించలేని అసమర్థ పాలకులు. మోడిని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు లేదని, బడే భాయ్ కు కోపం వస్తుందనా లేక చోటే భాయ్ కి ఇబ్బంది కలుగుతుందనా అని వ్యంగంగా ప్రశ్నించారు.
రైతుల బాధలు తీర్చలేనప్పుడు ఎంపీ పదవులు ఎందుకని, రేవంత్ రెడ్డి బెయిల్ కాన్సిల్ అయి మళ్ళీ లోపలికి వెళ్తాడనా అని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లాకు 75 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అయితే 72 వేల యూరియా వచ్చిందని అధికారులు చెపుతున్నారు. మరి వచ్చిన యూరియా ఎటు వెళ్ళిందని ప్రశ్నించారు. రైతుకు యూరియా బస్తా ఇవ్వలేని అసమర్థ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు.