calender_icon.png 18 September, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సొసైటీలకు పీఐసీల నియామకం

18-09-2025 01:27:48 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): పనితీరు సరిగా లేని సొసైటీల పాలక మండలి స్థానంలో ప్రభుత్వం కొత్తగా (పర్సన్ ఇంచార్జ్) పీఐసీలను నియమించిందని మహబూబాబాద్ జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ విధంగా మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రం, తొర్రూర్, కురవి, నెల్లికుదురు, బయ్యారం సొసైటీల పాలక మండలి స్థానంలో పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు ఆయన తెలిపారు.

సహకార శాఖ సహాయ అధికారులను ఆయా సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిగా నియమించినట్లు చెప్పారు. కేసముద్రం పర్సన్ ఇన్చార్జిగా ప్రవీణ్, బయ్యారంకు ఆదినారాయణ, కురవికి సుమలత, నెల్లికుదురుకు మనోహర్ రావు, తొర్రూరుకు రమేష్ నియమితులైనట్లు ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లాలో 19 సొసైటీలు ఉండగా, ప్రభుత్వం సొసైటీల పనితీరు నిర్దేశించడానికి రూపొందించిన విధానాల మేరకు ఐదు సొసైటీల నిర్వహణ లేకపోవడం వల్ల పాలకమండళ్లకు పొడగింపు ఇవ్వకుండా పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు డీసీఓ తెలిపారు.