15 April, 2026 | 6:23 AM

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం

26-06-2025 12:58 AM

కామారెడ్డి జూన్ 25,(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమకొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు తెలియ చేయునది గురువారం  ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మాచారెడ్డి మండల కేంద్రంలోని  బాలాజీ ఫంక్షన్ హాల్ లో కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మరియు అనుబంధ సంస్థల కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం కలదనీ పార్టీ నాయకులు తెలిపారు.

కావున ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ ఉమ్మడి నిజాంబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు ధనసరి సీతక్క,  ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారులు  మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ  , జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్  షట్కర్  విచ్చేయుచున్నారు .