17 April, 2026 | 9:32 PM

Breaking News

జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •  

కువైట్లో చిక్కుకున్న గన్నేరువరం వాసి తన భర్తను రక్షించాలంటూ భార్య మొర

14-06-2025 12:02 AM

- స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 

కరీంనగర్, జూన్ 13 (విజయ క్రాంతి): బతుకుదెరువు కోసం ఫుడ్ డెలివరీ బాయ్ గా కువైట్ కు వెళ్లిన ఓ వ్యక్తి కంపెనీ మోసం చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. తన భర్తను స్వదేశానికి తీసుకు రావాలని బాధితుడి భా ర్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన కొంపెల్లి ప్రవీణ్ 10 నెలల క్రితం ఉపాధి నిమిత్తం కువైట్ వెళ్లాడు. అక్క డ ఫుడ్ డెలివరీ బాయ్ గా పని చేశాడు. ఐతే అక్కడి కంపెనీ అతనికి జీతం ఇవ్వలేదు.

స్వదేశానికి తిరిగి రావడానికి చేతిలో చిల్లిగవ్వ లేక అక్కడే పస్తులతో ఇబ్బంది పడుతున్నాడు. అతనికి భార్య  శిరీష, ఒక కూతురు, కుమారుడు ఉ న్నారు. కాగా, తన భర్తకు నెల జీతంతోపాటు భోజన, వసతి సౌకర్యాలు కంపెనీవారే ఇవ్వాల్సి ఉండగా.. యాజమాన్యం  పనిచేయించుకొని  జీతం ఇవ్వలేదని, కనీసం తిండి పెట్టడం లేదని అవేదన వ్యక్తం చేసింది. జీతం డబ్బులు అడిగితే గదిలో బంధించి ఇష్టం వచ్చినట్లు కొడుతూ మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని శిరీష ’విజయక్రాంతి’ కి తెలిపింది.

వారి చర్యలతో తన భర్త ప్రాణానికి హాని ఉందని, వెంటనే కువైట్లో చిక్కుకున్న తన భర్తను రక్షించాలని కోరుతుంది. తిరిగి రావడానికి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడనీ, రెండు నెలలుగా తిండి కి ఇబ్బంది పదుతుంటే అప్పులు చేసి పంపిస్తున్నామని.. తన భర్తను ఇక్కడికి తీసుకు వచ్చి ఆదుకోవాలని శిరీష ప్రభుత్వాన్నివేసుకుంటుంది.