13-10-2025 05:50:18 PM
నిర్మల్ రూరల్: నిర్మల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సంఘం ఐక్యత కోసం కృషి చేస్తానని నూతన అధ్యక్షులు ఆమెడ శ్రీధర్ అన్నారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు తనను అధ్యక్షునిగా ఎన్నుకోవడం అభినందనీయమని తనపై మరింత బాధ్యత పెరిగిందని ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి అన్ని విధాల ఆదుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.