13-10-2025 05:45:55 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాతృమూర్తి లక్ష్మీనరసమ్మ ఇటీవల మృతి చెందడంతో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం పరామర్శించారు. లక్ష్మీనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఆమె ఆత్మ శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.