13-10-2025 08:13:54 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కనీస మద్దతు ధర పోస్టర్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన కనీస మద్దతు ధరలు పోస్టర్ను విడుదల చేశారు. సంచాలకులు, మార్కెటింగ్ శాఖ హైదరాబాద్ సరఫరా చేసిన MSP ధరలు, కాటన్ కాపాస్ కిసాన్ యాప్ కి సంబంధించిన కాటన్ ప్రొక్యూర్మెంట్ పోస్టర్ లను కలెక్టరేట్లో ఆవిష్కరించిన అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు రూపొందించిన కనీస మద్దతు ధరలు పోస్టర్లను రైతులకు ఉపయోగం కోసం రిలీజ్ చేయడం జరిగిందని అన్నారు. వీటిని జిల్లాలోని ప్రతీ వ్యవసాయ మార్కెట్ కమిటీ లకు సరఫరా చేయడం జరిగినదన్నారు. ఇక్కడి నుండి గ్రామ పంచాయతీలకు, రైతు వేదికలకు, మండల ఆఫీసులకు సరఫరచేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.