28-08-2024 03:31:06 AM
సూర్యాపేట, ఆగస్టు27(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో ఉన్న అతి పెద్ద ఆయకట్టు ఎస్సారెస్పీ. ఎస్సారెస్పీ రెండోదశ ఆయకట్టు కింద ఉన్న రైతులు గోదావరి జలాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే వానాకాలం సీజన్ ప్రారంభమై ఇప్పటికే రెండు నెలలు పూర్తి కాగా గోదావరి జలాల విడుదలపై అధికారుల నుంచి ఎలాంటి స్పష్టత లేక పోగా కనీసం కసరత్తు కూడా జరుగుతున్న ట్లు కనబడటం లేదు. దీంతో వానాకాలం ప ంటల సాగుకు గోదావరి నీళ్లు వస్తాయో రా వోననే సందిగ్ధం రైతుల్లో నెలకొన్నది.
జిల్లాలో 2.20లక్షల ఆయకట్టు
జిల్లాలో ఎస్సారెస్పీ రెండోదశ కింద సు మారు 2.20లక్షల ఆయకట్టు ఉంది. జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ని యోజకవర్గాల పరిధిలో ఎస్సారెస్పీ ఆయక ట్టు ఉంది. ఈ ఆయకట్టుకు 69,70,71 డీబీఎంల ద్వారా గోదావరి జలాలను అంది స్తారు. 69వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ జిల్లాలో తిరుమలగిరి మండలం జలాల్‌పురం వద్ద ప్రారంభమై 27 కిలోమీటర్లు ప్రయాణించి నూతనకల్ మండలం మాచినపల్లి వద్ద ము గుస్తుంది. దీని పరిధిలో 28 ఉపకాల్వలు ఉ ండగా తిరుమలగిరి, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాల పరిధిలో 60,572 ఎకరాల ఆయకట్టు ఉంది.
ఈ డీబీఎం కింద మహబూబ్‌నగర్ జిల్లాలో 7వేల ఎకరాల ఆయకట్టు ఉంది. 70వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ తిరుమలగిరి మండలం వెలిశాల వద్ద ప్రార ంభమై నాగారం మండలంలోని కొత్తపల్లి వ ద్ద ముగుస్తున్నది. 9 కిలోమీటర్ల పొడవుగల ఈ కాల్వ పరిధిలో 11 ఉపకాల్వలు ఉన్నా యి. ఈ డీబీఎం కింద 7 వేల ఎకరాల ఆయకట్టు ఉంటుంది. ఎస్సారెస్పీ రెండోదశ ఆయ కట్టులో అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ కెనాల్ 71.
తిరుమలగిరి మండలం శాంతినగర్ వద్ద ప్రా రంభమయ్యే ఈ కాలువ పెన్‌పహడ్ మండలంలో ముగుస్తుంది. 68.45 కిలో మీటర్లు మేర ప్రయాణించే ఈ కాలువ కింద 75 ఉపకాల్వలు ఉండగా తిరుమలగిరి, అర్వపల్లి, నా గారం, సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), చివ్వెం ల, పెన్‌పహడ్, మోతే, మునగాల, నడిగూడె ం మండలాలలో 1,41,230 ఎకరాల ఆయకట్టు ఉంటుంది.
నీటి విడుదలపైనే ఆశలు..
జిల్లాకు ఎస్సారెస్పీ, లోయర్ మానేరుల నుంచి సాగునీరు అందించే అవకాశం ఉన్న ది. 2018 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది రెండు సీజన్‌లకు క్రమం తప్పకుండా గోదావరి జలాలు జిల్లాలో పారుతున్నాయి. దీం తో జిల్లా రైతులు ఎస్సారెస్పీపైనే గంపెడాశ లు పెట్టుకున్నారు. ప్రతి ఏడు వానాకాలం సీ జన్‌లో దాదాపు ఆగస్టు మొదటి లేదా రెం డో వారంలో నీటిని విడుదల చేస్తూ వచ్చేవా రు. గతేడాది ఆగస్టు 9న ఆయకట్టుకు నీళ్లు విడుదల కాగా ప్రాజెక్ట్‌లో ఆశించిన స్థాయిలో నీరు లేకున్నా వానాకాలం పంటలకు పూర్తి స్థాయి లో సాగు నీటిని అందించారు.
కాగా యాసంగి పంట లకు ఆరుతడి పద్ధతిలో నీటిని విడుదల చేయగా వరి సాగు చేసి న రైతులు నీరు అందిక నష్టపోయారు. అయితే ఈ ఏడాది జూన్, జూలై మాసంలో కు రిసిన వర్షాలతో దిగువ గోదావరికి వరద పోటెత్తింది. దీంతో ఈ వానాకాలంలో కూ డా ఆగస్టు నెలలోనే సాగు నీరు ఇస్తారని భా వించిన ఆయకట్టు రైతులు ముందుగానే నా ర్లు పోసుకున్నారు. కానీ గోదావరి జలాల వి డుదలపై అధికారులల్లో స్పష్టత కరువైంది.
ప్రశ్నార్థకంగా ఆయకట్టు..
ఎగువన గోదావరికి అశించిన వరదలు రాకపోవడంతో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌లో 40 శాత మేరకే నీరు చేరినట్లు సమాచారం. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు మేడిగడ్డ, అన్నారం, సు ందిళ్ల నుంచి ఎత్తిపోతలు సకాలంలో జరుగకపోవడంతో అనుకున్న స్థాయిలో నీరు చే రలేదు. గత నెలలో కొంత మేరకు గోదావరి జలాలను మిడ్‌మానేరుకు తరలించారు. దీ ని సామర్థ్ంయం 27.50 టీఎంసీలు. అయితే ఇది పూర్తిగా నిండితే లోయర్ మానేర్ కు నీ టిని తరలించ వలసి ఉంటుంది. ఎస్సారెస్పీ, లోయర్ మానేర్‌లో నీరు సమృద్ధిగా చేరితేనే కాల్వలకు విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు. కాగా గత యాసంగి సీజన్‌లో జిల్లాలో దాదాపు 2లక్షల ఎకరాల ఆయకట్టు బీడుగా ఉండగా.. ఈ సీజన్‌లోనైనా నీళ్లు వస్తాయని ఆశించిన ఆయకట్టు రైతుకు సాగు ప్రశ్నార్థకంగా మారింది.