calender_icon.png 25 August, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలనచిత్ర రంగానికి అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తా

25-08-2025 12:24:02 AM

భార్బరిక్ మూవీ ప్రీమియర్ షో ప్రారంభించిన ఎమ్మెల్యే

హనుమకొండ టౌన్, ఆగస్టు 24 (విజయ క్రాంతి): వరంగల్, హనుమకొండ వేదికగా చలనచిత్ర రంగానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని, చిత్రాలను చిత్రీకరించేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నాయని ఇక్కడి కళా సంపదను సినిమాల ద్వారా తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటి చూపాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలియజేశారు.

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యులాడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించిన చిత్రం మోహన్ శ్రీ వాత్స దర్శకత్వంలో ”త్రిబాణాదారి బార్బరిక్‌” చిత్రం ప్రీమియర్ షో ఆదివారం హనుమకొండ ఏషియన్ మాల్ లో ప్రారభించిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తూ, ఘనవిజయం సాధించాలని అని అన్నారు.

అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సినిమా రంగానికి పెద్ద పీఠ వేస్తూ, ప్రభుత్వపరమైన సహాయ, సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్లు ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు ఉదయభాను, సత్యం రాజేష్, కరాటే ప్రభాకర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈ.వి  శ్రీనివాస్ రావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, తోట పవన్, చిత్ర యూనిట్ తదితరులు పాల్గొన్నారు.