15-07-2025 12:00:00 AM
ఎప్పటి నుంచి అమలవుతుందో ప్రకటించని ప్రభుత్వం?
గడువు పెంచిన ఫలితం లేదు?
నిరాశలో నిరుద్యోగ యువతీ, యువకులు
వనపర్తి, జూలై 14 ( విజయక్రాంతి ) : ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉన్నా అరకొర ఉద్యో గాల్లో అవకాశాలు రావు. ఆఖరుకు స్వయం ఉపాధి కల్పించుకుని పొట్ట పోసుకుందామన్నా అదృష్టమూ అందిరావడం లేదు అని నిరుద్యోగ యువతీ, యువ కులు నిరాశ, నిస్పృహల్లో పడిపోతు న్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, ఈడబ్ల్యూ ఎస్ కమ్యూనిటీలకు చెందిన నిరుద్యోగ యువతీ, యువకులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథ కాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
దీంతో ఉద్యోగావకాశాలు దక్కని నిరుద్యోగ యువతీ, యువకుల్లో పెరుగుతున్న నిరాశను తొలగించి ఆర్ధిక పరిపుష్టి సాధించే దిశ గా అడుగులు వేయించాలని ప్రభుత్వం భా వించింది. ఆయా కమ్యూనిటీలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రా రంభించి మూడు నెలల క్రితమే ఆ ప్రక్రియను పూర్తి చేసింది. దరఖాస్తు దారుల్లో ఎంత మందికి సహాయం అందించనున్నది.
అర్హులకు అందించే సబ్సిడీని బ్యాంకులకు ఎప్పుడు పంపిస్తుంది. అసలు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తుంది అనే విషయంపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి ఎటువం టి ప్రకటన చేయలేదు. దింతో అసలు ఈ పథకం అమలు అవుతుందా లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారనుందా అనే స మాధానం లేని ప్రశ్నగా నిరుద్యోగుల పాలిట మారింది.
పలు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన తర్వాత జిల్లా వ్యాప్తంగా ( మార్చి 17 వ తేదీ నుండి ఏప్రిల్ 08 వ తేదీ వరకు) ఎస్పీ కార్పొరేషన్ కు 3882 మంది, ఎస్టీ కార్పొరేషన్ 1547 మంది, బీసీ కార్పొరేషన్ 10546 మంది, మైనార్టీ కార్పొరేషన్ 1300 మంది నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు.
గడువు పెంచిన ఫలితం లేదు
రాజీవ్ యువ వికాసం పథకం కింద జి ల్లాలోని నిరుద్యోగులకు ఆర్ధిక సహా యం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. దరఖాస్తులు స్వీకరించి నెలలు గడిచినా ప్రభుత్వం లబ్దిదారులను గుర్తించకపోవడంతో నిరు ద్యోగ యువతీ, యువకులు తమ అ సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదటగా మార్చి 17 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకర ణ ప్రక్రియను ప్రారంభించి ఏప్రిల్ 5 వరకు దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
ఆ సమయంలో తహసీల్దార్ల నుంచి తీసుకున్న తాజా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జతపరచాలని ప్రభు త్వం చెప్పింది. వాటి కోసం నిరుద్యోగ యువతీ, యువకులు కార్యాలయాల చు ట్టూ తిరిగారు. అదే సమయంలో సాంకేతిక కారణాల వల్ల సర్టిఫికెట్ల జారీ ఆలస్యమయింది.
ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి పలువురు ప్రజా ప్రతినిధులు తీసుకురావడంతో ఏప్రిల్ 14 వరకు ( మరో 9 రోజులు ) గడువు పొడిగించింది. దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసి దాదాపు మూడు నెలలు అవుతున్న ప్రభుత్వం వీరికి ఆర్థిక సహాయం అందించే విషయంలో స్పందించడం లేదు.
పథకం ఇలా. .
రాజీవ్ యువ వికాసం పథకం కింద. ప్ర భుత్వం స్వయం ఉపాధి కల్పించుకునే యు వతీ, యువకులకు రూ 50 వేల రూపాయ ల వరకు నూరుశాతం సబ్సిడీతో ఆర్థిక స హాయం అందించాలని నిర్ణయించింది. రూ 50,001 రూపాయల నుంచి రూ లక్ష రూ పాయల వరకు విలువచేసే యూనిట్ స్థా పించుకునేవారికి 90 శాతం సబ్సిడీ, 10 శా తం బ్యాంకులోను సమకూర్చాలని,
రూ 1,0 0,001 నుంచి రూ 2 లక్షల రూపాయల వరకు విలువచేసే యూనిట్ స్థాపించుకునేవారికి 80 శాతం సబ్సిడీ, 20 శాతం బ్యాం కు లోను, రూ 2,00,001 నుంచి రూ 4 లక్షల రూపాయల వరకు విలువచేసే యూ ని టన్ను సమకూర్చుకునేవారికి 70 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు లోన్ ను అం దించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లా స్థాయి కమిటీ అప్రూవ్ చేసినా
రాష్ట్ర ఆవిర్భావ దినమైన జూన్ 2న ఈ పథకాన్ని ప్రారంభించి లబ్దిదారులకు ఆర్థిక సహాయ పత్రాలు అందజేస్తారని ప్రచారం జోరుగా జరిగింది. ఎంతో ఆశతో ఉన్న యు వతీ, యువకులకు ఆ రోజు అది ఆచరణకు నోచుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. రూ 50 వేలు, రూ లక్ష లోపు దర ఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల్లో కొంతమంది.
లబ్ధిదారులకు రెండు కేటగిరి ల కింద జిల్లా కమిటీ అనుమతి ఇవ్వడంతో జూన్ 2న అం దరికి మంజూరు పత్రాలు ఇస్తారని ఆశించా రు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ ఆర్థిక సహా యం అందలేదు. త్వరలోనే ప్రభుత్వం ఈ ఏడాదికి పెట్టుకున్న లక్ష్యం మేరకుస హా యం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.