calender_icon.png 15 July, 2025 | 8:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్

15-07-2025 12:00:00 AM

20 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత

దేవరకొండ, జూలై 15: దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ ఆశ్రమ పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. సుమారు 20 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆంబులెన్సుల ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆదివా రం సాయంత్రం బొబ్బర్లు, రాత్రి చికెన్ భోజనం, ఉదయం పులిహోర తిన్న విద్యార్థులు కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడుతుండటంతో పాఠశాల సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం విద్యార్థుల ఆ రోగ్యం నిలకడగా ఉంది. విద్యార్థులకు మై రుగైన చికిత్స అందించాలని, ఫుడ్ పాయిజ న్ ఘటనపై విచారణ జరిపించాలని నల్లగొ ండ కలెక్టర్ ఇలా త్రిపాఠికి  ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందించారు.