04-09-2025 12:44:42 AM
-సీఎం రాక కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లా ప్రజలు
-వరద నష్టంతో నిధులు కేటాయించి ఆదుకుంటారా
-సీఎం రాక ఉమ్మడి జిల్లా ప్రజలకు ఉపశమనం కలిగే నా
-ప్రజల ఆశలను ముఖ్యమంత్రి రేవంత్ వమ్ము చేస్తారా..
కామారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి)ః ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరార్తో ఉమ్మడి జిల్లా ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అసలే భారీ వర్షాలు వరదల వల్ల ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలో భారీ నష్టం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కట్టుబట్టలతో బయటపడిన కుటుంబాలకు ప్రస్తుతం తాతకాలికంగా కుటుంబానికి 14 వేల ఆర్థిక సాయం అందించారు. ఇండ్లలో వరద నీరు చేరి పిల్లల పుస్తకాలు కూడా పనికిరాకుండా ఆస్తి పత్రాలు, బట్టలు ఇంట్లో ఉన్నసర్వం బురద పాలై ఏమిటికి పనికిరాకుండా పోయాయి.
కట్టుబట్టలతో నిరాశ్రయులైన వరద బాధితులకు భారీ ప్యాకేజీ అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. అన్ని కుటుంబాలు సైతం మధ్యతరగతి కుటుంబాలే పనులు చేస్తేనే పూట గడిచే బతుకునీడుస్తున్న వారికి వర్ణుడు కోలుకోలేని దెబ్బతీశాడు. వారి కుటుంబాలు ఆర్థికంగా నిలదుకోవాలంటే ప్రభుత్వం ఆర్థిక సాయం చేయకుంటే అప్పుల పాలై బతుకులన్నీ అగమ్యగోచరంగా మారుతాయి బాధితులు వాపోతు న్నారు. ప్రభుత్వం భారీ స్థాయిలో నష్టపరిహారం చెల్లించి తేనే ఆర్థిక పరిస్థితులనుంచి బయటపడగలుగుతామని బాధితులు పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక తమకు ఎంతో ఆనందం కలిగిస్తుందని బాధితులు తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమ కుటుంబాల నాదుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా జిల్లాల్లో భారీగా రోడ్లు, కల్వర్టులు, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులు, వరదల ఉధృతికి ధ్వంసం అయ్యాయి. ఉమ్మడి జిల్లాలో వందల కోట్ల నష్టం వాటిల్లింది. రోడ్ల మరమ్మతులకు ప్రత్యేక నిధులు వస్తాయని ఉమ్మడి జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రాక ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎంతో మేలును చేస్తుందని ఆశిస్తున్నారు. ప్రజల ఆశలు అడియాశలవుతాయా...? లేక నెరవేరుతాయ ముఖ్య మంత్రి ప్రకటించే వరాలపైనే ఆధారపడి ఉంటుంది.
ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిన అధికారులు
ఉమ్మడి నిజాంబాద్ కామారెడ్డి జిల్లాలో జరిగిన వరద నష్టం వివరాలను ఉమ్మడి జిల్లా అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. ముఖ్యమంత్రి రాకతో అధికారులు పంపించిన నష్టం వివరాలతో ప్రత్యేక నిధులు కేటాయించి ఆదు కోవాలని ఉమ్మడి జిల్లాల ప్రజలు కోరుతున్నారు. గతంలో ఎన్న డు లేని విధంగా ఉమ్మడి జిల్లాలో జరిగిన బారి నష్టం నుంచి ఉమ్మడి జిల్లా ప్రజలు తేరుకోవడం లేదు.
ప్రాణాల నుంచి ప్రజలను కాపాడిన నష్టం మాత్రం మిగిలింది
భారీ వర్షాల వల్ల ఉమ్మడి జిల్లాలో ప్రజల ప్రాణా నష్టాలను కాపాడిన ఉమ్మడి జిల్లా అధికారులు నష్టాన్ని మాత్రం అరికట్ట లేకపోయారు. ఊహించని వరదలు భారీ వర్షం రావడం ఉమ్మడి జిల్లా ప్రజలనే కాకుండా అధికారులను సైతం నీవేరపోయేలా చేసింది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ లు, పోలీస్ కమిషనర్, కామారెడ్డి జిల్లా ఎస్పీ లు ప్రత్యేక చొరవ తీసుకొని జిల్లా అధికారులను అలర్ట్ చేయడమే కాకుండా వారు ముందుకు వెళ్లి ధైర్యాన్ని నింపి ప్రాణా నష్టం జరగకుండా కాపాడగలిగారు. వరదల తాకిడికి రహదారులు, చెరువులు, కుంటలు తెగిపోవడం, ప్రాజెక్టులు, నుంచి భారీ వరద రావడంతో వేలాది ఎకరాల వరి పంట, మొక్కజొన్న, సోయ పంటలు నీట మునిగాయి. తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఉమ్మడి జిల్లాల రైతులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి రాక వల్ల రైతులు తమకు జరిగిన పంట నష్ట ము ఇప్పించి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రిని రైతులు కోరుతున్నారు.
ముఖ్యమంత్రి రాకకు ఏర్పాట్లు పూర్తి
వరద బాధితులను పరామర్శించేందుకు గురువారం కామారెడ్డి జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి జిల్లా అధికారులు కలెక్టర్ ఆశిష్ సంగువన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలం ఎర్రపాడు వద్ద ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా రానుండడంతో హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి లింగంపేట మండలంలో పలు బ్రిడ్జిలను, వరదకు నీట మునిగిన పంట పొలాలను పరిశీలించనున్నారు. అక్కడినుండి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాటులు పూర్తి చేశారు.