04-09-2025 12:39:07 AM
- ముందుకు సాగని పవర్ ప్లాంట్ రైల్వే లైన్ నిర్మాణ పనులు
- నాలుగేళ్ల యినా.. నత్తనాడకే
- నేటికీ లైన్లో పడని పనులు
- పట్టింపు లేని పవర్ ప్లాంట్ యంత్రాంగం
- కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. పట్టిం చుకోని జెన్కో అధికారులు
- నిత్యం బొగ్గు లారీలతో వాహన దారుల సతమతం
మణుగూరు, సెప్టెంబర్ 3 ( విజయక్రాంతి) : భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ తె లంగాణ రాష్ట్రానికి వెలుగులు పంచుతూ, వి ద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక భూ మిక పోషిస్తుంది. థర్మల్ పవర్ ప్లాంట్ బొ గ్గు అవసరాల కోసం మణుగూరు నుండి బి టిపిఎస్ వరకు 18.67 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ నిర్మాణ పనులను నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. పనులు ప్రారంభ మై దాదాపు నాలుగేళ్లయినా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. పను లు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతున్నాయి.
రైల్వే లైన్ నిర్మాణ పనుల జా ప్యంఫై విజయ క్రాంతి కథనం.ఊరిస్తూ.. ఉ సూరుమనిపిస్తూ రైల్వే లైన్ నిర్మాణం కోసం మణుగూరు, సమితిసింగారం, రామా నుజవరం గ్రామాల నుంచి 201 .30 ఎకరాల మేరభూమిని ప్రభుత్వం సేకరించింది.నిర్వాసితులకు పరిహారం, ఇల్లులు కోల్పోయిన వారికి ఆర్ అండ్ ఆర్ కాలనీలు కూడా ని ర్మించారు. కానీ కొందరు మెరుగైన పరి హా రం కోసం నిర్వాసితులు కోర్టును ఆశ్రయించటంతో పలు కేసులు పెండింగ్ లో ఉన్నా యి. రైల్వే లైన్ నిర్మాణం కోసం ఇంకా 6 కి.మీ మేర భూమిని సేక రించాలి భూ సేకరణలో అంత రాయం, కాంట్రాక్టర్ అలసత్వంతో పనుల ఆలస్యానికి ప్రధాన కా రణంగా కనిపిస్తోంది. ట్రాక్ నిర్మాణ పనుల ను ప్రారంభించి, నాలుగేళ్లయినఊరిస్తూ.. ఉ సూరుమనిపిస్తూ ముందుకు కదలడం లేదు.
నాలుగేళ్ల యినా.. నత్తనాడకే
మణుగూరు నుండి బి టి పి ఎస్ వరకు చేపట్టిన రై ల్వే లైన్ పనులు ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. రూ. 300 కోట్లతో చేపట్టిన పనులలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వచ్చినట్టు కనిపిస్తోంది. జాప్యం కారణంగా నాలుగేళ్లు పూర్తయినా నత్త నడకనే పనులు కొనసాగు తూనే ఉన్నాయి. ఎప్పటికి పూర్తి చేస్తారో స్పష్టత లేదు. అసలు ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తుందా అ నే సందే హాలను వ్యక్త మవుతున్నాయి. మ ణుగూరు నుండి పవర్ ప్లాంట్ వరకు 18. 67 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న ఈ రైల్వే లైన్ లో ఇప్పటి వరకు కల్వర్టులు, వంతెనలు, ఆర్వోబీల్లాంటి పనులు పూర్తయ్యాయి. ట్రాక్ నిర్మాణ పనులు కాలయాపనతో సాగుతు న్నాయి.
లారీలతో వాహనదారుల సతమతం
మణుగూరు బొగ్గు గనుల నుంచి రాత్రిం బవళ్లు పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేసే లారీలు అతి వేగంతో ప్రయాణిస్తూ నిత్యం ప్రమాదాలకు కారణ మవుతున్నాయి. లారీ ల అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనదారులను బెంబేలెత్తిస్తూ ప్రాణాలను హరిస్తున్నా రు. రోజుకు దాదాపు వందలాదిలారీలు అధికలోడు, అతివేగం రాకపోకలు సాగిస్తూ ప్రయాణికుల పాలిట మృత్యుశకటాల్లా తయారవుతున్నాయి. దీంతో ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటి కైనా పవర్ ప్లాంట్ యాజమాన్యం, అధికారులు స్పందించి రైల్వే లైన్ నిర్మాణ పనులు వేగ వంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని, బొగ్గు లారీల నుండి తమ ప్రాణాలను కాపాడాలని ప్రజల కోరుతున్నారు.