calender_icon.png 5 September, 2025 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అపర్ణ అక్రమగోడల పాపం అధికారులదే!

04-09-2025 12:53:49 AM

  1. మూడు నెలల ముందే గ్రామస్తుల ఫిర్యాదు

అక్రమ గోడల నిర్మాణానికి అధికారుల సహకారం

ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోని ఉన్నతాధికారులు

బడా సంస్థకు తలొగ్గినట్టు ఆరోపణలు

గోడల గూడుపుఠాణీపై భగ్గుమంటున్న గ్రామస్తులు 

హైకోర్టు నోటీసులిచ్చినా చర్యలు శూన్యం

సంగారెడ్డి, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఈదుల నాగులపల్లిలో నిర్మించిన భారీ ప్రహరీ బాగోతం రోజురోజుకు చర్చకెక్కుతోంది. రేడియల్ రోడ్డును ఆనుకొని కిలోమీటర్ల మేర ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి చేపట్టిన అడ్డు గోడల పాపమంతా అధికారులదేనని స్పష్టమవుతోంది. సామాన్యు డు ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేపడితే ఆగమేఘాల మీద నోటీసులు, కూల్చివేతలు చేపట్టే అధికారులు..

అపర్ణ అక్రమాలపై ఎం దుకు ఉదాసీనంగా ఉన్నారో అర్థం చేసుకోవ చ్చు. గ్రామం కనిపించనంతగా ప్రైవేట్ వ్య క్తులు నిర్మాణాలు చేపట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని గ్రామ స్తులు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూ డకపోవడంతో సమస్య మరింత జఠిలమైం ది. ఒకరు కాదు, ఇద్దరు కాదు పదుల సంఖ్య లో ఫిర్యాదులు జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, ఈఈ, రామచంద్రపురం రెవ్యెన్యూ అధికారులకు వినతులు సమర్పించినా పట్టించుకునే నాథులు కరువయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అపర్ణ కన్‌స్ట్రక్షన్ సంస్థ తమ గ్రా మంలోని ప్రభుత్వ భూమిలో భారీ గోడలు నిర్మిస్తోందంటూ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు స్పందించి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చే ది కాదని గ్రామస్తులు పేర్కొంటున్నారు. కనీసం రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారి కూడా లే కుండా ప్రహరీ నిర్మాణాలు చేశారని, అపర్ణ సంస్థ అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేసేవారు లేకుండా పోయారని వాపోతున్నారు. 

చక్రం తిప్పిన అధికారి?  

నాగులపల్లిలో నిర్మిస్తున్న అడ్డుగోడలకు రామచంద్రాపురం రెవెన్యూ అధికారి అండ గా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గోడల విషయంపై ఫిర్యాదులు చేయడానికి వెళ్లిన గ్రామస్తులను, స్థానిక లీడర్లను సదరు అధికారే డైవర్ట్ చేశారని, అంతేగాక ఆ బడా నిర్మాణ సంస్థ నుంచి రాయబారాలు నడిపారని బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఫిర్యాదులు అందినా అక్రమ గోడల వైపు కన్నెత్తి కూడా చూడలేదనే విషయం గ్రామస్తులు చేస్తున్న ఆరోపణలకు ఊతం చేకూరుస్తోంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేస్తున్నారని తెలిసినా రెవెన్యూ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

అధికారులకు అంత ప్రేమ ఎందుకో?

ఈదుల నాగులపల్లిలో రేడియల్ రోడ్డు కు ఆనుకొని భారీ ప్రహరీ నిర్మిస్తున్న అపర్ణ కన్‌స్ట్రక్షన్‌పై జిల్లా అధికారులు ఎనలేని ప్రేమను కురుపిస్తున్న ఆరోపణలు వస్తున్నా యి. రామచంద్రాపురం తహసీల్దార్‌ను వివరణ కోరితే ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారులతో సదరు సంస్థ కో ఆర్డినేషన్ చేసుకొని నిర్మా ణం చేశారని చెబుతున్నారు. అత్యవసరమనుకుంటే ప్రభుత్వమే నిర్మాణం చేపట్టాలి గానీ, గ్రామస్తులకు ఇబ్బంది కలిగించేలా ప్రైవేట్ సంస్థ భారీ గోడలు నిర్మించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. 

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా లాభం లేదు

మా గ్రామంలో నిర్మిస్తున్న ప్రహరీ విషయంలో ఏప్రిల్ నెలలోనే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. నాగులపల్లి గ్రామం సర్వే నంబర్ 134, 135 లలో కూడా అపర్ణ సంస్థ అక్రమంగా చొరబడిందని కూడా విన్నవించాం. ఇదే విషయమై ఆర్‌అండ్‌బీ చేవెళ్ల డివిజన్ ఈఈకి, ఎస్‌ఈ హైదరాబాద్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. కానీ ఏ ఒక్క అధికారి కూడా అక్రమ గోడల నిర్మాణాలను ఆపలేదు సరికదా వారికి వంతపాడారు. నిలదీసిన వారిపై  దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. 

 మల్లేశం గౌడ్, గ్రామస్తుడు నాగులపల్లి

రైల్వే స్టేషన్‌కు దారి లేకుండా చేశారు

నాగులపల్లి గ్రామం అవతల ఉన్న రైల్వే స్టేషన్‌కు వెళ్ళేందుకు దారి లేకుండా భారీ గోడలు కడుతున్నారు. గోడలు ప్రారంభ దశలోనే రామచంద్రాపురం తహసీల్దార్‌కు ఫిర్యాదులు చేశాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు.

మా గ్రామస్తులకు దారి లేకుండా నిర్మిణాలు చేస్తున్నా అందరూ చూస్తూ ఉండిపోతున్నారు. ఇలాంటి సమస్యలపై రెవెన్యూ అధికారులు స్పందించపోతే ఇంకా ఎవరికి చెప్పుకోవాలి. మూడు నెలల క్రితం గోడలను ఆపి ఉంటే మాకు సమస్యలు వచ్చేవి కావు. అందుకే కోర్టును ఆశ్రయించాం.

 లింగం, గ్రామస్తుడు, నాగులపల్లి

గోడలతో నష్టం లేదు..

ఈదుల నాగులపల్లి రేడియల్ రోడ్డుకు ఆనుకొని అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ నిర్మించిన భారీ గోడలతో గ్రామస్తులకు ఇబ్బంది ఏమీ లేదు. గతంలోనే ఆర్‌అండ్‌బీ 3 ఫీట్ల గోడ ఉంది, ప్రస్తుతం దానిమీదే నిర్మాణం చేశారు. ఇందుకు ఆర్‌అండ్‌బీ, రైల్వే అధికారులతో కో ఆర్డినేషన్ చేసుకొని గోడలు కట్టారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు నేను అక్కడికి వెళ్లి పరిశీలించా. రైల్వే స్టేషన్ వెళ్లడానికి దారి వదిలారు. హైకోర్టు నుంచి నోటీసులు అందాయి. కౌంటర్ దాఖలు చేస్తాం.

 సంగ్రామ్‌రెడ్డి, తహసీల్దార్, ఆర్సీపురం