calender_icon.png 6 November, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరు కొనసాగేనా ?

06-11-2025 12:00:00 AM

  1. ఆసీస్‌తో నేడు నాలుగో టీ20
  2. తుది జట్టులో మార్పులు డౌటే
  3. నితీష్ రెడ్డి ఆడడంపై సస్పెన్స్

గోల్డ్ కోస్ట్, నవంబర్ 5 : రసవత్తరంగా సాగుతున్న భారత్, ఆస్ట్రేలియా సిరీస్‌లో నాలుగో టీ ట్వంటీకి కౌంట్‌డౌన్ మొదలైంది. గురువారం గోల్డ్ కోస్ట్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగబోతోంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయిన తర్వాత ఇరు జట్లూ చెరొక మ్యాచ్ గెలవడంతో ప్రస్తుతం సిరీస్ 1 సమంగా ఉంది. సిరీస్ చేజిక్కించుకోవాలన్నా లేక చేజారకుండా ఉండాలన్నా ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మూడో టీ ట్వంటీలో కంగారూలను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్‌గా బరిలోకి దిగుతోంది.

గత మ్యాచ్‌లో బౌలింగ్‌లో అర్షదీప్ సింగ్, బ్యాటింగ్‌లో వాషింగ్టన్ సుందర్ అదరగొట్టారు. టాపార్డర్ బ్యాటర్లు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడకున్నా, కీలకమైన భాగస్వామ్యాలతో సత్తా చాటారు. బౌలింగ్ అవకాశం రాకపోవడంతో వాషింగ్టన్ సుందర్ బ్యాట్‌తో రెచ్చి పోయాడు. వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పుపై ఫోక స్ ఉన్న నేపథ్యంలో తన ఆల్‌రౌండ్ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. అతనితో పాటు తిలక్ వర్మ, జితేశ్ శర్మ కూడా రాణించారు. ఫలితంగా సిరీస్‌ను సమం చేయడంలో భారత్ సక్సెస్ అయింది.

ఇప్పుడు అదే జోరు కొనసాగించి ఆధిక్యంలో నిలవాలని పట్టుదలగా ఉంది. బ్యా టింగ్‌లో అభిషేక్ శర్మ, శుభమన్ గిల్ మెరుపు ఆరంభాన్నిస్తే మాత్రం తిరుగుండదు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాద వ్ ఫామ్ కలవరపెడుతోంది. టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న తర్వాత సూర్య పెద్దగా రాణించడం లేదు. వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ప్రతీ సిరీస్‌లో ప్రతీ ప్లేయర్ ఫామ్ నిరూపించుకోవాల్సిందే. దీంతో ఆసీస్ టూర్‌లో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలిఉండడంతో సూర్యాకుమ్రా ఫామ్‌లోకి వస్తాడో లేదో చూడాలి.

అటు బౌలింగ్‌లో అర్షదీప్‌సింగ్ తన ప్రాధాన్య తను నిరూపించుకున్నాడు. హర్షిత్ రా ణాను పక్కన పెట్టి మూడో టీట్వంటీలోకి అవకా శమి వ్వగా పవర్ ప్లే లోనే 2 కీలక వికెట్లతో ఆసీస్‌ను దెబ్బకొ ట్టాడు. అలాగే స్పిన్నర్లు కూడా పర్వాలేదనిపిస్తున్నా గత మ్యాచ్‌లో టిమ్ డేవిడ్, స్టోయినిస్‌లకు కట్టడి చేయలేకపోయారు. కాగా భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ సాధిస్తే మాత్రం ఎవరి స్థానంలో తీసుకుంటారనేది చూడాలి.

మరోవైపు మూడో టీ20లో బ్యాటర్ల వైఫల్యమే ఆ సీస్ ఓటమికి కారణమైంది. టిమ్ డేవిడ్, స్టోయినిస్ ఆదుకోకుంటే ఆసీస్ ఇంకా తక్కు వ స్కోరుకే పరిమితమై ఉండేది. అయితే ఇప్పుడు స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ జట్టులోకి రావడం కంగారూల బలాన్ని పెంచింది. గాయంతో తొలి మూడు మ్యాచ్‌లకు మాక్సీ దూరమయ్యాడు.

గత రికార్డులు

టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు 36 మ్యాచ్‌లలో తలపడితే భారత్ 21 విజయాలను అందుకుంది. ఆస్టేలియా 12 మ్యాచ్‌లలో గెలవగా రెండింటిలో ఫలితం తేలలేదు. ఒకటి రద్దయింది.

పిచ్ రిపోర్ట్ 

నాలుగో టీ20కి వర్షం ముప్పు లేదు. గోల్డ్ కోస్ట్ పిచ్ సహజంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు కాస్త సహకరించినా తర్వాత బ్యాట ర్ల ఆధిపత్యం ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు.

భారత తుది జట్టు (అంచనా)

గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్(కెప్టెన్), తిలక్ వర్మ, జితేశ్ శర్మ(కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్‌సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)

షార్ట్, మిఛెల్ మార్ష్ (కెప్టెన్), ఇంగ్లీస్(కీపర్), టిమ్ డేవిడ్, మిఛ్ ఓవెన్, స్టోయినిస్, మాక్స్‌ల్, బార్ట్‌లెట్, డ్వార్సియస్, ఎల్లిస్, కున్నేమన్