calender_icon.png 6 November, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీమిండియా ఆల్ రౌండ్ షో

06-11-2025 05:33:01 PM

నాలుగో టీ20లో ఘనవిజయం

ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియా గడ్డపై టీ ట్వంటీ ఫార్మాట్ లో భారత్(Team India) దుమ్మురేపుతోంది. మూడో టీ ట్వంటీలో గెలిచి సిరీస్ సమం చేసిన టీమిండియా నాలుగో మ్యాచ్ లోనూ అదరగొట్టింది. గోల్డ్ కోస్ట్ వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లలో సమిష్టిగా రాణించి కంగారూలను చిత్తు చేసింది. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడితే అక్షర్ పటేల్, శివమ్ దూబే ఆల్ రౌండ్ షోతో దుమ్మురేపారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఓపెనర్లు అభిషేక్ శర్మ, గిల్ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 56 పరుగులు జోడించారు. అయితే అభిషేక్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 28 పరుగులకు అతను ఔటవగా.. గిల్ రాణించాడు.

వన్ డౌన్ లో శివమ్ దూబేను పంపించి టీమిండియా చేసిన ప్రయోగం బాగానే ఫలితాన్నిచ్చింది. దూబే ధాటిగా ఆడి 22 పరుగులకు వెనుదిరిగాడు. సూర్యకుమార్ 20, గిల్ 46 పరుగులకు ఔటవగా.. తిలక్ వర్మ,. జితేశ్ శర్మ నిరాశపరిచారు. చివర్లో అక్షర్ పటేల్ ధాటిగా ఆడి 11 బంతుల్లోనే 1 ఫోర్, 1 సిక్సర్ తో 21 రన్స్ చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, జంపా 3 వికెట్లు పడగొట్టారు.

168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆరంభంలో ధాటిగానే ఆడింది. ఓపెనర్లు మార్ష్, షార్ట్ తొలి వికెట్ కు 37 పరుగులు జోడించారు. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఆసీస్ కోలుకోలేకపోయింది. జోస్ ఇంగ్లీస్, టిమ్ డేవిడ్, స్టోయినిస్ కూడా ఫ్లాప్ అయ్యారు. దాదాపు రెండు నెలల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన మాక్స్ వెల్ నిరాశపరిచాడు. కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ మ్యాజిక్ కు తోడు శివమ్ దూబే కూడా 2 వికెట్లు తీయడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 119 పరుగులకే ముగిసింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్ లో చివరి టీ ట్వంటీ శనివారం బ్రిస్బేన్ వేదికగా జరుగుతుంది.