06-11-2025 12:00:00 AM
ముంబై, నవంబర్ 5 : దక్షిణాఫ్రికాతో సొంతగడ్డపై జరిగే రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. ఊ హించినట్టుగానే వైస్ కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లాండ్ టూర్‌లో నాలుగో టెస్ట్ సందర్భంగా క్రిస్ వోక్స్ వేసిన బంతి కాలికి బలంగా తగిలి పంత్ గాయపడ్డాడు. గాయం కారణంగానే విండీస్‌తో సిరీస్‌కు పంత్ దూరమయ్యాడు. అప్పటి నుంచీ ఆటకు దూరమైన ఈ వికెట్ కీపర్ ఇటీవలే సౌతాఫ్రికా ఏ జట్టుతో అనధికార టెస్ట్ ద్వారా మైదానంలోకి అడుగుపెట్టాడు. వస్తూనే రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి ఫామ్ అందుకున్నాడు. కాగా విండీస్‌పై ఆడిన జట్టునే దాదాపుగా కొనసాగించారు. పేసర్ ఆకాశ్ దీప్ జట్టులోకి తిరిగి రాగా, దేవదత్ పడిక్కల్ చోటు దక్కించుకున్నాడు.
అయితే రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించినప్పటకీ కరుణ్ నాయర్‌కు నిరాశే మిగిలింది. డబుల్ సెంచరీ చేసిన నాయర్‌ను సెలక్టర్లు పట్టించుకోలేదు. అలాగే మహ్మద్ షమీ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. దేశవాళీ క్రికెట్‌లో మళ్లీ ఫామ్ అందుకున్నప్పటకీ షమీని సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకోలేదు. అలాగే బరువు తగ్గడంతో పాటు ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ కూడా ఎంపిక కాలేదు. పేస్ ఎటాక్‌ను బుమ్రా లీడ్ చేయనుండగా.. స్పిన్ విభాగం లో జడేజా,సుందర్, అక్షర్ పటేల్‌తో పాటు కుల్దీప్ ఎంపికయ్యారు.ఇక రెండు టెస్టుల సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 18 నుంచి జరుగుతుంది.
సౌతాఫ్రికాతో టెస్టులకు భారత జట్టు:
శుభమన్ గిల్ (కెప్టెన్), పంత్(వైస్ కెప్టెన్), జైస్వాల్ , కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్ జురెల్, జడేజా, సుందర్, బు మ్రా,అక్షర్ పటేల్, నితీష్‌రెడ్డి, సిరాజ్ . కుల్దీప్, ఆకాశ్ దీప్
భారత్ ఏ జట్టు: తిలక్ వర్మ(కెప్టెన్), రుతురాజ్, అభిషేక్ శర్మ, పరాగ్, ఇషాన్ కిషన్, బదోనీ, నిశాంత్ సింధు, విప్ర జ్ నిగమ్, మానవ్ సుతార్, హర్షిత్ రాణా, అర్షదీప్, ప్రసిద్ధ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ భారత్ ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ మరోవైపు సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ ఏ జట్టు ను కూడా ప్రకటించారు. ఈ సిరీస్‌లో భార త్ ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్‌గా , రుతురాజ్ గైక్వాడ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యారు.