14-02-2026 12:00:00 AM
రసకం దాయంలో ఖానాపూర్ మున్సిపాలిటీ
ఖానాపూర్, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్రంలో హోరా హోరిగా సాగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానా పూర్ మున్సిపాలిటీ ఫలితాలు పూర్తి హంగుగా నిలిచాయి. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉండగా ఇక్కడ కాంగ్రెస్ మూడు, బీజేపీ నాలుగు, బి ఆర్ ఎస్ నాలుగు, ఇండిపెండెంట్ 1 స్థానాల్లో గెలుపొందా రు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ చైర్మన్ పీఠం దక్కించుకోవడం సాధ్యమేనా..? అన్న ప్రశ్న ఉత్పన్న అవు తుందని పలువురు బావిస్తున్నారు.
స్థానిక ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా రు. ప్రాముఖ్యంగా ఖానాపూర్ తన సొంత నియోజకవర్గం కాగా ఇక్కడ మూడు పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. ఫలితంగా ఖానాపూర్ పట్ట ణ ప్రజలు మూడు పార్టీలను సమం గా ఆదరించారు. దీంతో అధికార చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. పట్టణంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్‌కు ఎక్స్ అఫీషియో ఓటు తప్పనిసరిగా మార నుందని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్, బిజెపి పార్టీలు కలిసి అధికారం పంచుకోవడం జరుగుతుందేమోనని పలువురు చర్చిం చుకుంటున్నారు. ఏది ఏమైనా ఇదివరకే ఒక ఇండిపెండెంట్ ను అధికా ర కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోగా, ఇకముందు మూడు పార్టీల నాయకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుం టారో వేచి చూడాలని పట్టణ ప్రజ లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పలువులు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీల అధిష్టానం నిర్ణయం కీలకం కాబోతోందన్నది విశేషం.