14-06-2024 12:00:00 AM
అవినీతి నిరోధక శాఖకు చిక్కుతున్న అధికారులు ఎందరో. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయినాక కూడా చేతులు తడపందే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు అయ్యే పరిస్థితులు లేవు. అవినీతి, అధికారం నాణేనికి రెండు ముఖాలుగా మారిపోయాయి. దేశంలో, రాష్ట్రంలో ఎయిడ్స్ మహమ్మారికన్నా అవినీతి మహమ్మారి వేగంగా విస్తరించింది. ‘ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్’ అధ్యయనం ప్రకారం ప్రభుత్వ కార్యాలయాలలో పనుల నిమిత్తం 75 శాతం ప్రజానీకం లంచాలు చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందనీ తెలుస్తుంది.
ప్రపంచంలోని 176 దేశాలతో పోలిస్తే భారత్ రేటింగ్ 83వ స్థానంలో వుంది. గత సంవత్సరం మన స్థాయి 92. అవినీతి లేని సమాజాన్ని నిర్మించడం మన హక్కు. అవినీతి అధికారులను శాశ్వతంగా ఉద్యోగం నుండి తొలగించాలి. ప్రతి గ్రామగ్రామాన, పట్టణాలలో అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నంబరులను గోడలమీద రాయించాలి. టోల్ ఫ్రీ నంబరు 1064 గురించి విస్తృతం గా ప్రచారం చేయాలి.
కామిడి సతీష్ రెడ్డీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా