14-06-2024 12:00:00 AM
ఈ కాలం అమ్మాయిలపై సినిమాలు, ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల ప్రభావం చాలా ఎక్కువగా వుంటున్నది. దీంతో వాళ్లు సులువుగా ఆకర్షణలకు లోనవుతున్నారు. చాలా సందర్భాల్లో పిల్లలు ప్రేమలో పడిన విషయాన్ని ఎవరో చెబితే మాత్రమే తల్లిదండ్రులకు తెలుస్తున్నది. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు సన్నిహితంగా గమనించే తీరిక లేకపోవడమే ఈ విపత్తుకు ప్రధాన కారణం. తల్లి లేదా తండ్రి ఎవరో ఒకరు నిత్యం వాళ్లతో ప్రేమగా కొద్దిసేపయినా తప్పక మాట్లాడాలి. వాళ్ల చదువుల గురించి మాత్రమే కాదు, వాళ్ల ఆలోచనలను కూడా తల్లిదండ్రులు పట్టించుకోవాలి.
అప్పుడే వారు తప్పుదారి పట్టకుండా వుండగలరు. సెల్‌ఫోన్ల ద్వారా వీడియోలు చిత్రీకరించి మళ్లీ వారికి చూపించి భయభ్రాంతులకు గురిచేసి వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేసిన సంఘటనలు దాదాపుగా మన కళ్లముందు రోజుకు అక్కడ ఇక్కడ కనబడుతూనే ఉన్నాయి. వీటన్నిటికి ప్రధాన కారణం పిల్లలతో తల్లిదండ్రులకు ఇంటరాక్ట్ సరైన విధంగా లేకపోవడమే. అందుకని, పెద్దలు టీనేజ్ పిల్లలను ఓ కంట కనిపెట్టడం తప్పనిసరి.
డా. చిటికెన కిరణ్ కుమార్, రాజన్న సిరిసిల్ల